Early Morning Activities: సూరీడు మన ముంగిటకు వచ్చే సరికి నిద్ర లేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. సూర్యుడు నెత్తిమీది కొచ్చేదాకా కాళ్లు బార్లా చాపుకొని పడుకోవడం మంచిది కాదని పెద్దలు కూడా చెబుతుంటారు. ఉదయం లేవడం వల్లనే ఆరోగ్యానికి మేలు చేసే క్రియలన్నీ జరుగుతాయి. డబ్బు పెట్టి కొనకుండానే ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన డి విటమిన్ సూర్యరశ్మితోనే అందుతుంది. అంతేకాదు.. మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. సూరీడుతో పాటే లేచి.. ఈ నియమాలు పాటిస్తే ఎన్ని లాభాలో చూడండి.
- ఉదయం లేవగానే చేసే పనులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
- లేవగానే ఒకటీ, రెండు గ్లాసుల మంచినీరు తాగాలి. శరీరంలో హైడ్రేషన్ పెంచే నీటితో జీవక్రియను ప్రారంభిస్తే మేలు చేస్తుంది.
- అదనపు శక్తిని పెంచుకోవడానికి అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు సమకూరుతాయి.
- ఉదయం ధ్యానానికి పది నిమిషాల సమయం కేటాయిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- ఒంటికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
- శరీరానికి తప్పనిసరిగా శ్రమను అలవాటు చేయాలి.
- పొద్దున్నే భారీ బరువులు మోయకుండా తేలికపాటి బరువులు మోయాలి.
- శరీరంలో రక్త ప్రసరణ పెరిగితే స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు చేస్తే బాగుంటుంది.
- ప్రోటీన్లతో నిండిన అల్పాహారం తీసుకోవాలి. ఇది రోజంతా శక్తినిస్తుంది.
- ఇష్టపడే వ్యక్తులతో ఉదయం కొద్దిసేపు గడపాలి. కుటుంబంతో కలిసి టిఫిన్ తినడం, స్నేహితులతో కలిసి వ్యాయామం చేయడం మేలు చేస్తుంది.
- ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అభిరుచి దాగి ఉంటుంది. బొమ్మలు గీయడం, చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పెరటి తోటల పర్యవేక్షణ చేయడంతో ఉల్లాసంగా ఉంటుంది.
- ఉదయం లేవగానే చరవాణి తీసుకొని ఇతరుల స్టేటస్, టెక్ట్స్ చూడటంతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇతరుల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పక్కదారి పడుతాయి.
- ఉదయం 8 గంటలలోపు అన్ని పనులు పూర్తి చేసుకున్నట్లయితే అనుకున్న విజయాలు సాధించడానికి వీలవుతుంది
ఇదీ చదవండి: గుమ్మడికాయతో క్యాన్సర్లకు చెక్!