tips to prevent health problems while eating festival: ండగల సమయంలో ముఖ్యంగా పిండి వంటల్ని ఆస్వాదించే విషయంలో అస్సలు రాజీపడరు కొంతమంది. ఈ క్రమంలో తమకు నచ్చిన స్వీట్స్, డీప్ ఫ్రై చేసిన వంటకాల్ని మనసారా ఆస్వాదిస్తుంటారు. ఇవి తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే అజీర్తి, కడుపుబ్బరం.. వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే ఈ సమయంలో నచ్చినవి మితంగా తీసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
నీళ్లు తాగడం మర్చిపోవద్దు: ఈ క్రమంలో- పండగ సీజన్లో ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం రండి.. ఏదైనా తినే ముందు కొన్ని నీళ్లు తాగడం వల్ల ఎక్కువ తినకుండా జాగ్రత్తపడచ్చు.. శరీరాన్నీ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. అలాగే రోజంతా మధ్యమధ్యలో నీళ్లు తాగుతూ ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో కాఫీ, శీతల పానీయాలు, కాక్‌టెయిల్స్.. వంటి వాటికి దూరంగా ఉండాలి.
పండగ సందర్భంగా - స్పెషల్స్ లేకపోతే ఎలా అని వాటిని బయటి నుంచి తెచ్చుకోవడం కాకుండా ఇంట్లోనే తయారుచేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వంటకాలు ఎంత బాగున్నా సరే మితంగానే తినాలి. పండగ రోజు తీసుకున్న ఆహారం వల్ల మన శరీరంలో చేరిన విషతుల్యాలను మరుసటి రోజు తొలగించుకోవాల్సి ఉంటుంది.
వ్యాయామం తప్పనిసరి: ఈ క్రమంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలాకాకుండా పండగ రోజు కొన్ని పదార్థాలు మిగిలిపోయాయి కదా అవి తీసుకుందాం అనుకుంటే.. అజీర్తి, కడుపుబ్బరం.. వంటి సమస్యలు తప్పవు! ఒకవేళ ఈ సమస్యలు బాధిస్తుంటే గుల్‌కండ్ తీసుకోవాలి. అలాగే పండగైనా సరే- రోజూ చేసే వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఇవీ చదవండి: