ETV Bharat / sukhibhava

మీ పిల్లల ఆహారం విషయంలో ఈ విషయాలు విస్మరించొద్దు - తెలుగు తాజా వార్తలు

అధిక బరువు వల్ల ఎలాగైతే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం.

మీ పిల్లల ఆహారం విషయంలో ఈ విషయాలు విస్మరించొద్దు

author img

By

Published : Mar 23, 2021, 3:55 PM IST

చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. 'మా పాప చాలా సన్నగా, బరువు తక్కువగా ఉందండీ.. దీంతో ఐదేళ్లొచ్చినా రెండేళ్లమ్మాయిలా కనిపిస్తుంది. తన బరువు పెంచాలంటే ఏం చేయాలో తోచట్లేదు.. మీకేమైనా అవగాహన ఉంటే కాస్త చెప్పండీ..' అంటూ ఇరుగుపొరుగు వారిని సలహాలు అడుగుతుంటారు. అయితే అనారోగ్యకర సలహాల వల్ల పిల్లలు బరువు పెరగకపోవడమే కాకుండా, వారి ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి వారిని ఓసారి పోషకాహార నిపుణుల వద్ద చూపించి, వారు బరువు పెరగడానికి నిపుణులు సూచించిన సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి. తద్వారా పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం...

బలవంతపెట్టొద్దు!
కొంతమంది తల్లులు పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని టెన్షన్ పడుతూ.. వాళ్లకు ఎలాగైనా ఆహారం తినిపించాలని నిర్ణయించుకుని బలవంతంగా తినిపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తినే ఆహారంపై వారికి ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ పద్ధతి వల్ల వారు తినకుండా మరింత మొండికేస్తుంటారు. దీనివల్ల వారికి అందాల్సిన పోషకాలు పూర్తిగా అందకుండా పోతాయి. కాబట్టి పిల్లల్ని ఆహారం విషయంలో బలవంతపెట్టకుండా.. వారికోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఏ పదార్థాలు, స్నాక్స్ ఇవ్వాలో ఓ ప్రణాళిక తయారుచేయాలి. దాని ప్రకారం వారికి పోషకాహారం అందించాలి. ఫలితంగా వారికి కావాల్సిన పోషకాలు అంది.. శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

వీటికి దూరంగా..
తల్లిదండ్రులు మామూలు సమయాల్లో టీవీ చూడనివ్వట్లేదని, కనీసం తినే సమయంలోనైనా టీవీ చూడచ్చని చాలామంది పిల్లలు ఆనందపడిపోతుంటారు. ఇక ఈ సాకుతో గంటలు గంటలు తినడానికే వృథా చేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల వారి ధ్యాసంతా ఆహారం మీద కంటే టీవీ మీదే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలేవీ వారు పట్టించుకోరు. అందులోని రుచి వారికి తెలియదు. ఈ క్రమంలో టీవీలో ఏవైనా ఆవేశపూరిత సన్నివేశాలొస్తే.. అవి వారి తిండి మీద, మనసు మీద ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఆటంకాల వల్ల వారు ఆహారం తీసుకోవడంపై మనసు లగ్నం చేయకపోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లలు తినే సమయంలో టీవీ ఆఫ్ చేసేయడం, మొబైల్స్, కంప్యూటర్, ల్యాప్‌టాప్స్.. వంటి గ్యాడ్జెట్లు వారికి దూరంగా ఉంచడం.. వంటివి చేయాలి. అలాగే వీటిపైకి మనసు మళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పక్కనే కూర్చొని పిల్లలు తినే ఆహార పదార్థాలపై వారికి అవగాహన కల్పించాలి. దానికి తగినట్టుగానే ఆహారం రంగు, రుచి, వాసన ఉండేలా చూసుకోవాలి. తద్వారా వారిలో ఆహారం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది.
క్యాలరీలూ ఆరోగ్యకరంగానే..
పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడాలంటే.. ముందుగా వారికి ఎక్కువ క్యాలరీలుండే ఆహారపదార్థాలు అందించాలి. అలాగని కేక్‌లు, స్వీట్లు, పిజ్జా, బర్గర్లు.. వంటివి పెట్టమని కాదు దానర్థం. చిక్కటి పాలు, మీగడ పెరుగు, ఆహారంలో భాగంగా నెయ్యి.. వంటి పదార్థాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభించే పండ్లు, కూరగాయల్ని కూడా వారి రోజువారీ ఆహారంలో భాగం చేయాలి. దీనిపై సరైన అవగాహన లేకపోతే సంబంధిత పోషకాహార నిపుణులను సంప్రదించి వారు సూచించే ఆహారాన్ని పిల్లలకు రోజూ అందివ్వాలి.

ఈ విటమిన్లూ ముఖ్యమే!
ఆర్నెళ్ల నుంచి ఐదేళ్ల వయసులో ఉన్న పిల్లలకు పూర్తిస్థాయి పోషకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎ, సి, డి విటమిన్లను చుక్కల రూపంలో అందిస్తోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరిగ్గా ఆహారం తీసుకోని పిల్లలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల పిల్లల ఎదుగుదల, బరువు పెరగడానికి.. కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు వారికి అందుతాయి. కాబట్టి బరువు తక్కువగా ఉన్న పిల్లల శరీర బరువు పెంచేందుకు నిపుణుల సలహా మేరకు వీటిని పిల్లలకు అందించడం శ్రేయస్కరం.
ఎప్పటికప్పుడు..
వయసు, ఎత్తు.. వంటివి ఆధారంగా బరువును నిర్ణయిస్తారు. కాబట్టి ముందుగా నిపుణులను సంప్రదించి వారి ఎత్తు, వయసు ప్రకారం వారు ఎంత బరువుండాలో తెలుసుకోవాలి. తర్వాత వారు అందించే సూచనలు పాటిస్తూ పిల్లల బరువును క్రమంగా పెంచాలి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు వారు ఎంత బరువు పెరుగుతున్నారు? ఒకవేళ ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తక్కువైతే పెంచాల్సిన మార్గాలు.. వంటి విషయాలన్నింటిపై తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉంటే మంచిది. కాబట్టి తక్కువ బరువు నుంచి వారిని బయటపడేయాలంటే ఇలా ఎప్పటికప్పుడు వారి బరువును చెక్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.

తక్కువ బరువున్న పిల్లల్ని ఆ సమస్య నుంచి బయటపడేయాలంటే తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకున్నారు కదా! మరి మీరు కూడా మీ పిల్లల విషయంలో ఇవన్నీ పాటించి వారి శారీరక ఆరోగ్యానికి తోడ్పడండి.

ఇదీ చూడండి: ఈ ఇంటి వయసు 200 ఏళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.