దోమల ద్వారా హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాప్తి ఎంతవరకు నిజం?. దోమల వల్ల వచ్చే రోగాలను నియంత్రించడం ఎలా?. ఈ సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వీటికి నిపుణులు ఏమని సమాధానమిచ్చారంటే..
రెండే మార్గాలు..
దోమలు సహా పలు కీటకాలను ఆర్త్రోపోడ్స్ అని అంటాం. ఈ ఆర్త్రోపోడ్స్ ద్వారా ఇన్ఫెక్షన్ ఒకరినుంచి మరొకరికి సోకాలంటే రెండే మార్గాలుంటాయి.
- వాటి కాళ్లు లేదా నోటిలో వైరస్ ఉంటే అది ఇతరుల్లోకి ప్రవేశిస్తుంది.
- ఆ కీటకాలు కాటు వేసినప్పుడు వైరస్ వ్యాపించే అవకాశముంటుంది.
హెచ్ఐవీ రాదు..
దోమల శరీరంలోకి హెచ్ఐవీ వైరస్ ప్రవేశించినప్పటికీ వాటి లాలాజల గ్రంథుల్లో వైరస్ రెప్లికేట్ కాదు. కాబట్టి దోమ కాటు వేసినప్పటికీ వైరస్ ఇతరుల్లోకి సోకదు. మలేరియా పారసైట్ లేదా ఇతర పారాసైట్లు మాత్రం దోమ కాటు ద్వారా సులభంగా ఇతరులకు వ్యాపిస్తాయి.
ఇతర రోగాలు రాకుండా ఏం చేయాలి?
దోమల వల్ల వచ్చే రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మస్కిటో నెట్స్, కాయిల్స్ వంటివి ఉపయోగించాలి. ఇంటి చుట్టు ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి నియమాలు పాటిస్తే వీలైనంత వరకు దోమల కాటు నుంచి మనం బయటపడతాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:కిడ్నీలోని రాళ్లు.. కరిగేదేెలా?