ETV Bharat / sukhibhava

కరోనాతో క్షయ పునరుత్తేజితం అవుతుందా? - క్షయ వ్యాధి కరోనా

కరోనా.. ఒంట్లో నిద్రాణంగా ఉన్న క్షయను సైతం తిరిగి ప్రేరేపితం చేసే ప్రమాదముందని పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ2 నిద్రాణ క్షయను పునరుత్తేజితం చేసే మూలకణ మాధ్యమ రక్షణ వ్యవస్థను ప్రేరేపించే అవకాశముందని ఐఐటీ గువాహటి, యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది.

covid affect on tb survivors, క్షయ వ్యాధి కరోనా
కరోనా జబ్బుతో క్షయ ఉద్ధృతి!
author img

By

Published : Jul 2, 2021, 12:25 PM IST

మనదేశంలో ఎంతోమంది కొవిడ్‌-19 బారినపడ్డారు. దీన్నుంచి కోలుకున్నారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవటం లేదు. కరోనా జబ్బు దుష్పరిణామాలు దీర్ఘకాలం వెంటాడుతూనే వస్తున్నాయి. వీటి జాబితాకు అంతే లేకుండా పోతోంది. వీటికి సంబంధించి మరో ఆందోళనకర విషయం బయటపడింది. ఇది ఒంట్లో నిద్రాణంగా ఉన్న క్షయను సైతం తిరిగి ప్రేరేపితం చేసే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ2 నిద్రాణ క్షయను పునరుత్తేజితం చేసే మూలకణ మాధ్యమ రక్షణ వ్యవస్థను ప్రేరేపించే అవకాశముందని ఐఐటీ గువాహటి, యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది.

ఇందులో భాగంగా పరిశోధకులు- నిద్రాణ స్థితిలో క్షయ గల ఎలుకల ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్‌ రకానికి చెందిన హెపటైటిస్‌ వైరస్‌-1 (ఎంహెచ్‌వీ-1) ఇన్‌ఫెక్షన్‌ తీరుతెన్నులపై అధ్యయనం చేశారు. వీటిల్లో తిరిగి క్షయ విజృంభించినట్టు గుర్తించారు. స్తబ్ధ మూల కణాలను నిద్రాణ క్షయ బ్యాక్టీరియా దారి మళ్లించి ఊపిరితిత్తుల్లో క్షయకు దారితీస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే క్షయ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా పరిణమిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు 40% మందిలో క్షయ నిద్రాణంగా ఉన్న మనలాంటి దేశాలకిది తీవ్ర ఆందోళనకరమైన విషయం. అందుకే 'కొవిడ్‌-19, నిద్రాణ క్షయ తిరిగి ప్రేరేపితం కావటం' మీద తక్షణం అధ్యయనం చేయాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు. క్షయ ప్రపంచ మహమ్మారిగా మారకముందే అడ్డుకోవటానికిది అత్యవసరమని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి : జోరు తగ్గని క్షయ వ్యాధి- ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.