కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు, వాటి నియంత్రణ విషయాల్లో ప్రజలకు కొన్ని అపోహలు, భయాలు ఉన్నాయి. వాటిపై స్పష్టత ఇచ్చారు అమెరికా మేరీల్యాండ్ యూనివర్సిటీలోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం సారథి ఫహీమ్ యూనస్.
1. కరోనాతో మనం నెలలు లేదా సంవత్సరాల పాటు సహజీవనం చేయాల్సి ఉంటుంది. అందుకని దాచాల్సిన, భయపడాల్సిన పనిలేదు. ఈ మహమ్మారికి భయపడి మన జీవితాన్న వృథా చేసుకోవాల్సిన పనిలేదు. కానీ నిజాన్ని తెలుసుకొని జీవించాలి.
2. లీటర్ల కొద్దీ నీరు తాగటం వల్ల వైరస్‌ను నాశనం చేయలేం. కరోనా వైరస్ కణజాలం పైచర్మానికి అతుక్కొని ఉండిపోతుంది. వేడినీళ్లు తాగడం వల్ల వాటిని కడుపులోకి పంపలేం.
3. వ్యక్తిగత రక్షణలో భాగంగా చేతులు కడుక్కోవడం, రెండు మీటర్ల భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
4. మీ ఇంట్లో కొవిడ్-19 సోకిన వ్యక్తి లేకపోతే క్రిమీసంహారకాలు స్ప్రే చేయల్సిన అవసరం లేదు.
5. కార్గో ప్యాకేజీలు, గ్యాస్ పంపులు, ఆన్లైన్ షాపింగ్ ప్యాకెట్లు, ఏటీఎమ్‌లు ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారకాలు కావు.
6. కొవిడ్-19 అనేది ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కాదు. ఇది ఫ్లూ సంబంధమైనది. రెస్టారెంట్ల నుంచి ఆహారం ఆర్డర్ ఇచ్చుకోవడం వల్ల సమస్యలేమీ రావు.
7. వాసన, రుచి కోల్పోవడానికి ఎలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణమవుతాయి. ఇవేవీ కరోనాకు నిర్ధిష్టమైన లక్షణాలు కావు.
8. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తరచూ దుస్తులు మార్చుకోవడం, ఎక్కువగా స్నానం చేయాల్సిన అవసరం లేదు. శుభ్రత అవసరమే కానీ భయం ఉండకూడదు.
9. కరోనా వైరస్ గాలిలో వేలాడుతూ ఉండదు. ఎవరైనా తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వచ్చిన తుంపర్లను మనం పీల్చితే వైరస్ బారిన పడతాం.
10. బయటకు వెళ్లి పార్కులో నడుస్తూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. అయితే ఇతరులతో భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి.
11. కొవిడ్-19 జాగ్రత్తల్లో భాగంగా చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు సాధారణ సబ్బు ఉపయోగించవచ్చు. ఇందుకు యాంటీబాక్టీరియా సబ్బు అవసరం లేదు. కొవిడ్-19 అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చేది కాదు. వైరస్ సంబంధమైనది
12. బయట నంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు. అవసరమైతే పార్శిల్లోని ఫుడ్‌ను కాసేపు మైక్రోవేవ్ ఓవెన్లో వేడిచేసుకుంటే సరిపోతుంది.
13. షూ, చెప్పులతో ఇంట్లోకి వస్తే వైరస్ వస్తుందనేది భ్రమ. అలా అయితే దాదాపు 20 ఏళ్లుగా నేను వైరస్‌లపై పరిశోధనలో ఉన్నా. ఎప్పుడూ మా ఇంటికి ఆ వైరస్‌తో ఇబ్బందులు రాలేదు.
14. వెనిగర్, చెరుకు సరం, అల్లం రసం తాగడం వల్ల కరోనా నుంచి రక్షించుకోలేరు. ఎందుకంటే అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి కానీ వ్యాధిని నివారించలేవు.
15. మాస్క్‌ను ఎక్కువ సమయం పాటు ధరిస్తే శ్వాసకోస సమస్యలతో పాటు శరీరానికి అవసరమైన ఆక్షిజన్ సరఫరా తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి. జనాల్లో ఉన్నప్పుడు మాత్రమే ముఖ కవచం ధరించాలి.
16. చేతులకు గ్లవ్స్ తొడుక్కోవడం మంచి ఆలోచన కాదు. ఎందుకంటే వైరస్ వాటికి అంటుకుని.. అనుకోకుండా వాటితో మీరు ముఖాన్ని తాకితే అది మరింత ప్రమాదకరం. దాని బదులు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
17. అదే పనిగా ఇంట్లో కూర్చొని ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎంత ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారం తీసుకున్నా.. ప్రతిరోజూ అలా పార్కు, బీచ్‌లో లేదంటే ఇంటి గార్డెన్లో తిరగండి.