ETV Bharat / sukhibhava

కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?

author img

By

Published : Apr 15, 2021, 10:31 AM IST

కరోనా కొత్త స్ట్రెయిన్​​ వేగంగా వ్యాపిస్తోంది. వైరస్​ పరివర్తనం చెందడం వల్ల అది పిల్లల్లో కూడా ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు డాక్టర్​ రాజేశ్​ వుక్కాల. వైరస్​ వ్యాప్తి, కొత్త స్ట్రెయిన్​​ లక్షణాలు మొదలైన విషయాలు వివరించారు.

new strain affecting kids, interview about new strain virus in india
కరోనా కొత్త స్ట్రేయిన్

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మహమ్మారిలో కొత్త వేరియంట్ల కారణంగా వైరస్.. ఇంతకుముందుతో పోలిస్తే ​ వేగంగా వ్యాపిస్తోంది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్​​​ వ్యాప్తిపై పలు అపోహలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డయేరియా, గ్యాస్ట్రో, అంతర్గత ఆరోగ్య సమస్యలు తలెత్తడం.. కొత్త స్ట్రెయిన్​​ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో కీలక విషయాలు వెల్లడించారు డాక్టర్​ రాజేశ్​ వుక్కాల.

ప్రస్తుతం కేసుల తీవ్రత ఎక్కువగా ఉందా?

చికిత్స కంటే నివారణ మేలు. వైరస్​ సోకినట్లు ఏమైనా లక్షణాలు కనిపిస్తే తక్షణం కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలి. అందులో పాజిటివ్​ అని తేలితే హోమ్​క్వారంటైన్​ అవ్వాలి. దీని ద్వారా వైరస్​ ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.

ఆక్సిజన్​ లెవెల్స్​, శరీర ఉష్ణోగ్రత ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఏమైనా కొత్త లక్షణాలు వస్తే వాటిని గుర్తించాలి. లక్షణాలు తీవ్రంగా ఉండి.. గాలి తీసుకోవడం ఇబ్బందికరంగా మారితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరడం మంచిది.

వీటితో పాటు ఆరోగ్య శాఖ హెచ్చరికలను అనుసరించి కొవిడ్​ మార్గదర్శకాలను తప్పక పాటించాలి.

ఈ వైరస్​ పిల్లల్లో కూడా ప్రభావం చూపించడానికి కారణం?

వైరస్​ పరివర్తనం చెందిన కారణంగా తన స్వభావాన్ని మార్చుకుంది. కాబట్టి ఇదివరకు పెద్దగా ప్రభావితం కాని వారిగా మనం భావించిన వారిలో కూడా ఈ కొత్తరకం వేగంగా వ్యాపిస్తోంది.

రెండో డోసు తీసుకున్న వారికి కూడా వైరస్​ ఎందుకు సోకుతోంది?

కొవిడ్​ నుంచి కోలుకున్న వారు, టీకా రెండో డోసు తీసుకున్న వారిలో కూడా వైరస్ వ్యాపించడం నేను గమనించాను. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అనే విషయంపై ప్రస్తుతం మా వద్ద సమగ్ర సమాచారం లేదు. కానీ వీరిలో లక్షణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం.

కొత్త స్ట్రెయిన్​ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అర్హులైనవారు వ్యాక్సిన్​ తప్పకుండా తీసుకోవాలి. వ్యాక్సినేషన్​ తర్వాత వైరస్ సోకినా అది ప్రతికూల ప్రభావాలు చూపించదు.

ఇదీ చదవండి : వ్యాయామం చేసినా బరువు తగ్గటం లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.