ETV Bharat / sukhibhava

చలికాలంలో చన్నీటి స్నానం చేస్తున్నారా! ఈ ప్రమాదాలు తెలుసా? - Health Care tips in telugu

Cold Water Bath in Winter in Telugu : చలికాలంలో దాదాపుగా వేడినీటితో స్నానం చేస్తారు. కానీ.. ఈ సీజన్​లో కూడా కొందరు చన్నీటి స్నానం చేస్తుంటారు. అయితే.. అది సరికాదు అంటున్నారు నిపుణులు. ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు కూడా రావొచ్చని హెచ్చరిస్తున్నారు..!

Cold Water Bath in Winter in Telugu
Cold Water Bath in Winter in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 10:15 AM IST

Cold Water Bath in Winter in Telugu: శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో చాలామంది ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. బాత్ రూంలోకి వెళ్లి ట్యాప్​ తిప్పాలన్నా, చల్లటి నీటిని తాకాలన్నా జంకుతారు. ఉదయం వేళ చల్లటి నీటిని తాకగానే బాడీలో వెబ్రేషన్స్ వచ్చేస్తాయి. అందుకే.. చాలామంది వేడినీటికే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే.. కొందరు కావాలనే చన్నీటి స్నానం చేస్తుంటారు. అయితే.. ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల.. వాతావరణ మార్పులు చేటు చేసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చన్నీటి స్నానం చేయడం వల్ల.. కొందరిలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని.. దానివల్ల ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశం ఉందని.. ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పాదాలు పగులుతున్నాయా? - ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

Effects of Cold Water Bath in Winter: ఒక వయసు దాటిన వారు.. చలి కాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల గుండెపోటు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరణానికి కూడా దారితీయవచ్చట. కాబట్టి.. ఇబ్బంది పడుతూ చన్నీటితో స్నానం చేయకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదంటున్నారు. ఈ కాలంలో శరీరంపై చల్లటి నీరు పడడతో.. శరీరంలోని రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయట. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల హార్ట్​బీట్​ అసాధారణంగా పెరుగుతుందనీ.. ఇలాంటి సమయంలో గుండెలో బ్లాక్ ఏర్పడి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సీతాఫలం తింటే జలుబు చేస్తుందా? - ఆయుర్వేదం ఏం చెబుతుంది!

పక్షవాతం వచ్చే అవకాశం: ఎముకలు కొరికే ఈ చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంపై ఒక్కసారిగా చన్నీరు పడడంతో.. శరీరంలోని టెంపరేచర్​లో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయట. సడన్​గా చన్నీళ్లు తలపై పోసుకున్నప్పుడు.. బ్రెయిన్​ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందట. అందువల్ల.. శరీరం హ్యాపీగా రిసీవ్ చేసుకునే టెంపరేచర్​లోనే స్నానం చేయాలని సూచిస్తున్నారు.

మొటిమల సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్​కు వెళ్లాలి!

ఇక చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల తిమ్మిర్లు, కళ్లు మసకబారడం, తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు. అందువల్ల ఈ సీజన్​లో వీలైనంత వరకు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుందని చెబుతున్నారు. తల స్నానం చేసేవారు నేరుగా తలపై పోసుకోకుండా.. ముందు కాళ్లు, ఆ తర్వాత ఒళ్లు తడిపిన తర్వాతనే.. తలపై నీళ్లు పోసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. నీటి టెంపరేచర్​కు అనుగుణంగా మెదడు స్పందిస్తుందని చెబుతున్నారు.

చిన్న పిల్లల్లో మలబద్ధకం సమస్యా? ఈ ఇంటి చిట్కాలతో చెక్​ పెట్టండి!

చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్​గా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.