పిల్లలు పుట్టినప్పటి నుంచి డైపర్ వాడకం (diaper usage) మొదలుపెడుతాం. అయితే.. వాటి వాడకంలో ఎన్నో అపోహలు, అనుమానాలు ( diaper Rashes in Babies causes)తల్లులకు ఉంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. మరి.. డైపర్ వాడకం ఎలా ఉండాలి?. తీసుకోవాల్సిన జాగ్రత్తలు (precautions in diapers usage) ఏంటో తెలుసుకుందాం..
పిల్లలకు డైపర్లు ఎప్పటి నుంచి వాడాలి?
పుట్టినప్పటి నుంచే పిల్లలు మలమూత్రాలు పోతారు కాబట్టి.. పుట్టినప్పటి నుంచే వీటిని (diaper usage by age) వాడుతాం. పిల్లలు తమకు తాము విసర్జించే తెలివి వచ్చే వరకు వాడుతుంటారు.
ఏ డైపర్లు ఉత్తమం?
బట్టతో చేసినవి, వాడిపారేసే(డిస్పోజబుల్) డైపర్లు సాధారణంగా అందరూ వాడుతుంటారు. బట్టతో చేసినవి వాడితే.. విసర్జించిన మలమూత్రాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది డిస్పోజబుల్కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ఇవి పర్యావరణానికి తీవ్ర హానిచేస్తాయి. అవసరమైన మేరకు బట్టతో చేసిన డైపర్ల వాడకమే ఉత్తమం. బట్టతో చేసిన డైపర్లో వాటర్ ప్రూఫ్ ఉన్న ప్లాస్టిక్‌ను వాడితే లీకేజ్ సమస్యను నివారించవచ్చు.
డైపర్ శుభ్రతలో జాగ్రత్తలు..
- బట్టతో చేసిన డైపర్లను ఇతర బట్టలతో కలపకుండా వేడినీటిలో ఉతకాలి.
- పిల్లలు మల విసర్జన చేసిన డైపర్‌ను అలాగే బయటపడేయకూడదు.
- పిల్లలు పాలు తాగిన తర్వాత డైపర్ వేయటం మంచిది. యూరిన్ చేసిన తర్వాత మార్చాలి. లేదంటే చర్మంపై ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.
- డైపర్ వేయడానికి ముందు ఆ శరీర భాగంపై పౌడర్ వేయాలనుకుంటే.. చేతితో వేయకూడదు.
- డైపర్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే పిల్లలను బోర్లా పడుకోబెట్టాలి. పిరుదులపై పౌడర్ రాయాలి.
అపోహలు..
- డైపర్ వాడకం వల్ల పిల్లల నడకలో ఎలాంటి శాశ్వత మార్పులు ఉండవు. కేవలం అది వాడినప్పుడు మాత్రమే కాళ్లు కొంత ఎడంగా పెట్టి నడుస్తారు.
- డిస్పోజబుల్ డైపర్ వాడితే పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. యూరిన్ పోసినప్పుడు చర్మానికి తేమ తగలకుండా ఉండటం వల్ల పిల్లలకు టాయిలెట్ అనే విషయమే తెలియదు. టాయిలెట్ పిల్లలు సొంతంగా పోయాల్సిన వయస్సు వచ్చేనాటికైనా బట్టతో చేసిన డైపర్ వాడితే టాయిలెట్ ట్రైనింగ్ సులభమవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:నడుము, తొడలకు మేలు చేసే పృష్టాసనం!