ETV Bharat / sukhibhava

కొవిడ్​ వ్యాక్సిన్​ వేసుకునేవారు నొప్పి మందులేసుకోవచ్చా?

కొవిడ్​ టీకా ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా చాలా మందిలో అపోహలు తొలగిపోలేదు. వ్యాక్సిన్​ వేసుకున్న వారిలోను, వేసుకోడానికి సిద్దంగా ఉన్న వారిలోను కొందరు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే ఇతర వ్యాధులకు మందులు వేసుకుంటున్న వారు టీకా వేసుకున్న తర్వాత వాటిని వాడొచ్చా..? వ్యాక్సిన్​ వేసుకున్న వెంటనే నొప్పి వస్తే నొప్పి మాత్రలు వేసుకోవచ్చా అనే ప్రశ్నలకు నిపుణులు ఏంటున్నారంటే..

sukibhava, corona vaccine
covid vaccine, pain killers
author img

By

Published : Mar 30, 2021, 6:52 AM IST

సమస్య: కరోనా టీకా తీసుకునేవారు నొప్పి మందులు వేసుకోవద్దని, ప్రమాదకరంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా?

- పి.బి. లక్ష్మి, హైదరాబాద్‌

సలహా: కరోనా టీకా కూడా నిజం వైరస్‌ మాదిరిగానే రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీంతో తాత్కాలికంగా జ్వరం, కండరాల నొప్పులు, టీకా తీసుకున్న చోట నొప్పి వంటివి తలెత్తొచ్చు. ఇవి టీకా ప్రభావం చూపుతోందనటానికి సంకేతాలే. అయితే

కొందరు టీకా వేయించుకోవటానికి ముందే నొప్పులు, జ్వరానికి భయపడి ఐబూప్రొఫెన్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు వేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. దీంతో రోగనిరోధక ప్రతిస్పందన తగ్గే అవకాశముందని, యాంటీబాడీలు అంతగా ఉత్పత్తి కావటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి టీకా తీసుకున్నాక జ్వరం, నొప్పుల వంటివి తలెత్తినా ప్రత్యేకించి నొప్పి మందుల అవసరం లేదు. మరీ ఎక్కువైతే వాడుకోవచ్చు గానీ అంత అవసరమేమీ రాదు. చాలావరకు పారాసిటమాల్‌ మాత్రలే సరిపోతాయి. అవసరమైతే వీటిని 650 మి.గ్రా. మోతాదులో ప్రతి 6 గంటలకు ఒకటి వేసుకోవచ్చు.

నొప్పి మందులు వాడుకోవాలని ప్రముఖ ఆరోగ్యసంస్థలేవీ సిఫారసు చేయలేదు. పారాసిటమాల్‌తో ఫలితం కనిపించకపోతే నొప్పి మందులు వాడుకోవచ్చు. అందువల్ల అత్యవసరమైతేనే.. అదీ డాక్టర్‌ సలహా మేరకే తీసుకోవాలి. ఇప్పటికే ఇతరత్రా జబ్బుల కారణంగా నొప్పి మందులు వాడుకునేవారైతే ఆపాల్సిన అవసరం లేదు. ఇలాంటివారు డాక్టర్‌ అభిప్రాయం తీసుకోకుండా ఆపేయటం తగదు. టీకా వేయించుకున్నాక నొప్పి, జ్వరం తగ్గటానికి మందుల కన్నా ముందుగా కొన్ని చిట్కాలు పాటించటం మేలు. టీకా వేయించుకున్న చోట నొప్పి ఉంటే తరచూ చల్లటి, తడి బట్టతో అద్దుకోవచ్చు. జ్వరంగా అనిపిస్తే ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. పలుచటి దుస్తులు ధరించాలి.

ఇదీ చూడండి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.