ETV Bharat / sukhibhava

మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవట!

Buttermilk With Salt Caused Health Problem : మీకు మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకునే అలవాటు ఉందా ? అయితే ఈ పద్ధతి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.! లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Buttermilk With Salt Caused Health Problem

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 1:31 PM IST

Buttermilk With Salt Caused Health Problem : మనలో చాలా మందికి అన్నంలోనో, లేదా నేరుగా మజ్జిగ తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల అన్నం సులభంగా జీర్ణమవుతుందని, అందుకే తీసుకుంటామని చెబుతుంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ మజ్జిగలోకి ఉప్పును వేసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు మజ్జిగలోకి ఉప్పును కలపకూడదా ? కలిపి తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం తీసుకున్న తరవాత మజ్జిగను తాగడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్‌ యాసిడ్‌ జీవక్రియను మెరుగుపరుస్తాయి. మీరు రోజు ఒకటి లేదా రెండు సార్లు మజ్జిగను ఉప్పు లేకుండా తీసుకోవడం వల్ల అది మీ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో చాలా పోషకాలుంటాయి. పొటాషియం, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎసిడిటీ ముదిరితే జరిగేది ఆ ఘోరమే - కడుపులోని మంట ఇలా ఆర్పేయండి!

మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

  • ఉప్పు కలిపిన మజ్జిగను తాగడం వల్ల నీరసం, అలసటి, పొట్ట భారంగా అనిపించడం, అపాన వాయువు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
  • కొంతమంది మజ్జిగలోకి మసాలాలు, పుదీనా వంటి వాటిని వేసి తీసుకుంటారు. ఈ మజ్జిగను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటే పేగులలోని మంచి బ్యాక్టీరియా చనిపోతుందని అంటున్నారు. కాబట్టి, మజ్జిగలోకి ఉప్పును కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు.
  • పుల్లగా ఉండే పెరుగులో ఎన్నో రకాల ఆమ్ల పదార్థాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోజనాలు సక్రమంగా శరీరానికి అందాలంటే ఉప్పు లేకుండా మజ్జిగ, పెరుగు తీసుకోవాలి.
  • పెరుగును ఉప్పుతో కలిపి తీసుకోవడం శరీరంలో కఫం, పిత్తం సమస్యలు పెరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇవి మన ఆరోగ్యాన్ని ఎంతో పాడు చేస్తాయని తెలియజేస్తున్నారు.
  • మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య కూడా వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మజ్జిగను తీసుకునే వారు ఉప్పును కలపకుండా నేరుగా దాన్ని తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
  • బ్లడ్ ప్రెషర్‌ (బీపీ) సమస్యతో బాధపడేవారు మజ్జిగలో ఉప్పును కలుపుకోకుండా తీసుకోవాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పైన తెలిపిన సమాచారం నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించాం. ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

అది సాధారణ రోగం కాదు - క్యాన్సర్​ కావొచ్చు - ఇలా గుర్తించండి!

బయటికి చెప్పుకోలేరు - భరించలేరు - ఫ్యూచర్​లో చాలా ప్రమాదకరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.