శారీరకంగా దృఢంగా ఉండేందుకు, బరువు తగ్గించుకునేందుకు, మంచి శరీర ఆకృతికి, జీవనశైలి వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు మంచి డైట్ అవసరం. మరి అది సరైన క్రమంలో ఉండాలంటే.. మన శరీరంలో కేలరీలను అదే రీతిలో కరిగించుకోవాలి. మరి ఏయే పనులు చేస్తే.. ఎన్ని కేలరీలు కరుగుతున్నాయో చూడండి మరి.
మనం తినే, తాగే వాటి నుంచి వచ్చే శక్తితో.. శ్వాస తీసుకోవడం సహా నడవడం, మాట్లాడటం, తినడం చేస్తున్నాం. అయితే.. ఈ ప్రక్రియలతో ఆ కేలరీలన్నీ కరగవు. మిగతా కేలరీలు మన శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే.. ఫిట్నెస్ లక్ష్యాలకు అనుగుణంగా సంపాదించిన కేలరీలను కరిగించుకోండి.
ఇదీ చదవండి: బియ్యప్పిండి ఫేస్ ప్యాక్‌తో మెరిసే అందం మీ సొంతం