ETV Bharat / sukhibhava

సైనస్​ ఇబ్బంది పెడుతోందా? ఈ ఆసనాలతో ఫుల్ రిలీఫ్​! - Yoga Poses for Sinusitis

Yoga for Sinusitis: సైనస్​తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదా..? అయితే ఈ యోగాసనాలను ట్రై చేస్తే రిలీఫ్​ పొందొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Yoga Poses for Sinusitis
Yoga Poses for Sinusitis
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 9:43 AM IST

Yoga Poses for Sinusitis: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో సైనసైటిస్ ఒకటి. సాధారణంగా సీజన్ మారినపుడు, ఉష్ణోగ్రతలలో మార్పువచ్చినపుడు సైనస్ వల్ల ఇబ్బందులు ఎక్కువవుతాయి. అయితే కొన్ని యోగాసనాలు ప్రాక్టిస్‌ చేస్తే.. వింటర్​లో సైనస్‌ లక్షణాలు కంట్రోల్‌లో ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సైనసైటిస్​ అంటే ఏమిటి: ముక్కు లోపలి భాగాల్లో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఈ సైనస్‌లు ఇన్ఫెక్షన్‌కు గురికావడం వల్ల సైనసైటిస్ వస్తుంది. అయితే ఇది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్, పొల్యూషన్​, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా అలర్జీల వల్ల కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది.

సైనసైటిస్​ లక్షణాలు: ముక్కు కారడం, ముఖంలో ఒత్తిడి, నొప్పి, వాసన గ్రహించే శక్తి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. జలుబు చేస్తుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా ఉంటుంది. కనుబొమ్మలు జివ్వుమని లాగుతుంటాయి. కాగా, శీతాకాలంలో సైనసిటిస్‌ లక్షణాలను తగ్గించడానికి.. కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. అవేంటంటే..

వింటర్​ ఎఫెక్ట్​- జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? నో టెన్షన్​- వీటిని ట్రై చేయండి!

సేతుబంధాసనం: ఈ ఆసనం ప్రాక్టిస్‌ చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే..

  • ముందుగా వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి.
  • ఇప్పుడు కాళ్లను పైకి లేపి పాదాలను నేలపై ఆనించి పిరుదులకి సమాంతరంగా ఉంచాలి.
  • శరీరానికి సమాంతరంగా అరచేతులను నేలపై చాచాలి.
  • నేల నుంచి శరీరాన్ని నెమ్మదిగా పైకి లేపాలి.
  • మీ భుజాలను సర్దుబాటు చేసుకుంటూ కదలకుండా నెమ్మదిగా భుజాలు, చేతులు, కాళ్లపై శరీర బరువు నిలపాలి.
  • గడ్డాన్ని ఛాతీకి తగిలేలా చూసుకోవాలి.
  • శ్వాస తీసుకుని వదలాలి. ఇలా పదిహేను సెకన్లు ఈ ఆసనంలో ఉండాలి.
  • తర్వాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

సడన్​గా బరువు పెరిగారా? - మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే! చెక్​ చేసుకోండి!

భుజంగాసనం: ఈ ఆసనం ఛాతిని, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. శ్వాస సమస్యలను దూరం చేస్తుంది. ఇది ఎలా వేయాలంటే..?

  • ముందుగా బోర్లా పడుకుని శరీరం మొత్తాన్ని పూర్తిగా సాగదీయాలి.
  • రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి.
  • అరచేతులను ఛాతి పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి.
  • శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతిని పైకి లేపాలి.
  • మోచేతులు నేలకు ఆనుకుని ఉండేలా చూసుకోవాలి.
  • కొద్దిసేపయ్యాక శ్వాసను వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి.

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!

మార్జాలాసనం: ఇది తరచుగా ప్రాక్టీస్‌ చేస్తే.. ఊపరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. మెడ నుంచి తుంటి వరకు ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇది ఎలా వేయాలంటే..

  • ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి.
  • శరీరాన్ని ముందుకు వంచుతూ మోకాళ్లు, అరచేతులు నేలకు ఆనించాలి.
  • అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటికి సమానంగా ఉంచాలి.
  • నెమ్మదిగా శ్వాస వదులుతూ.. నడుమును వీలైనంత పైకి లేపాలి.
  • తలను కొద్దిగా కిందికి దింపాలి. కాసేపు అలాగే ఉండాలి.
  • ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. నడుమును కిందికి వంచుతూ, తలను పైకి ఎత్తాలి. కాసేపు అలాగే ఉండాలి.​

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ - నిద్ర చాలకనే వచ్చాయనుకుంటున్నారా?

కపాలభాతి ప్రాణాయమం..: ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆక్సీజన్‌ పెంచుతుంది. ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది.

  • ముందుగా పద్మాసనం వేసి కళ్లు మూసుకుని కూర్చోవాలి. వెన్నెముక స్ట్రైట్​గా ఉండాలి.
  • రెండుచేతులూ మోకాళ్ల మీద ఉంచి శ్వాస దీర్ఘంగా, బలంగా తీసుకోవాలి.
  • ఆ సమయంలో పొట్ట మీద ఒత్తిడి కలిగిస్తూ నాభి వెన్నుభాగానికి తాకుతుందేమో అన్నట్టు లోనికి పంపాలి.
  • బలంగా ఊపిరి విడుస్తూ, అంతే వేగంగా శ్వాస తీసుకోవాలి. పొత్తికడుపును మీకు సాధ్యమైనంతగా లోనికి పంపండి.
  • 20 సార్లు శ్వాస తీసుకుని, వదలడం అయ్యాక కళ్లు తెరవకుండా సేదతీరాలి.
  • అలా మూడు దఫాలుగా చేయండి. ఇది చేస్తున్నప్పుడు ధ్యాసంతా పొత్తికడుపు మీదే ఉండాలి.

గర్భిణి ఒత్తిడికి గురైతే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రభావం - ఈ చిట్కాలను పాటించండి!

నిద్ర రావట్లేదా? - అల్లం, అశ్వగంధతో డీప్​ స్లీప్!

ఉదయాన్నే సోంపు నీళ్లను తాగితే - ఈ అనారోగ్య సమస్యలు దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.