Best Protein Food For Vegetarians : మీ జీవనశైలి, చేసే పనుల ఆధారంగా ఆహారాన్ని తీసుకోవాలి. శారీరక శ్రమ కలిగించే పనులు చేస్తున్నట్లయితే శరీరానికి ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇక ఆఫీసుల్లో కూర్చోని చేసే పనులైతే తక్కువ మోతాదులో మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మటన్, చికెన్ తీసుకోవడం వల్ల ఎక్కవ శక్తి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ శాకాహారంలో కూడా శరీరానికి అధిక బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఉన్నాయి.
Rich Protein Food Vegetarian : శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో ప్రొటీన్లు ముఖ్యమైనవి. సరిపడా ప్రొటీన్లు శరీరానికి అందితే.. కండరాలు పెరుగుదలకు ఉపయోగపడడం సహా చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంటాయి. ప్రొటీన్ అనే పేరు వినగానే మటన్, చికెన్ అందరికీ గుర్తుకొస్తుంది. వాటిని తింటే ప్రొటీన్ అధికంగా లభిస్తుందని అనుకుంటారు. కానీ చికెన్, మటన్ లాంటి మాంసాహార పదార్థాల్లోనే కాకుండా మీ శరీరానికి సరిపడా ప్రొటీన్లు పుష్కలంగా అందించే శాకాహార పదార్థాలు కూడా చాలానే ఉన్నాయి. శరీరానికి బాగా ప్రోటీన్లు అందించే ఐదు శాకాహార ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నట్స్..
nuts benefits In Telugu: నట్స్‌లో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ రోజువారి ఆహారంలో నట్స్‌ను భాగం చేసుకుంటే శరీరానికి కావాలసిన ప్రొటీన్ అందడం సహా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నట్స్‌లలో బాదం ముఖ్యమైనది. బాదం పిక్కలను రాత్రి నానబెట్టి ఉదయం బ్రెష్ చేయగానే తినండి. దీని వల్ల మీ కండరాలు బలపడతాయి.

పెరుగుతో జీర్ణక్రియ సమస్యలకు చెక్..
Curd Health Benefits : ఇంట్లో తయారుచేసే పెరుగును బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోండి. ఇంటి పెరుగు అవసరమైన ప్రోబయోటిక్స్‌ను అందిస్తుంది. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని కాపడడం సహా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం కావడానికి పెరుగు సహాయపడుతుంది.

మొలకలు..
Sprouts Benefits : బీన్స్, చిక్కుళ్లు, ఆకుపచ్చ బటానీలు, రాజ్మా వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. వీటిలో ప్రొటీన్ పదార్థాలతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే గుణం కూడా ఉంది. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీంతో మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

చియా విత్తనాలు..
చియా విత్తనాలను అల్పాహారంలో తీసుకోవడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి. చియా విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. దీంతో వీటిని రోజూ మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

వేరుశెనగలు..
వేరుశెనగలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
