ETV Bharat / sukhibhava

వ్యాయామానికి ముందు, ఆ తర్వాత ఇవి తింటున్నారా? - లేదంటే అంతే సంగతులు! - Healthy Foods

Workout After and Before Foods : ఆరోగ్యంగా ఉండాలని, అందంగా కనిపించాలని, బరువు తగ్గాలని చాలా మంది మార్నింగ్ లేవగానే వర్కౌట్స్ చేస్తుంటారు. ఇది మంచి విషయమే అయినా.. కేవలం కసరత్తులు చేస్తేనే సరిపోదని.. వాటికి ముందు, తర్వాత తీసుకోవాల్సిన ఆహారాల విషయంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.

Workouts
Workouts
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 1:33 PM IST

Best Foods for Pre and Post Workouts : మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, దృఢంగా మారాలన్నా డైలీ వ్యాయామం చేయడం తప్పనిసరి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది ఉదయాన్నే వర్కౌట్స్ చేస్తుంటారు. అయితే కొందరు తొందరగా బరువు తగ్గాలని అసలు తినకుండా వ్యాయామం చేస్తే.. మరికొందరు మాత్రం ఎలాగూ వర్కౌట్స్ చేస్తున్నాం కదా అని అతిగా తినేస్తుంటారు. ఈ రెండూ డేంజర్​ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వ్యాయమం అయినా, ఆహారమైనా.. మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలంటున్నారు. కాబట్టి మనం చేసే వర్కౌట్స్ ద్వారా సరైన ప్రయోజనాలు పొందాలంటే వ్యాయామం(Exercise)తో పాటు కొన్ని కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలంటున్నారు. ముఖ్యంగా వర్కౌట్స్ ముందు, తర్వాత తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు గురించి తెలుసుకొని వాటిని ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందుతారని చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వ్యాయామానికి ముందు తీసుకోవాల్సిన ఆహారాలు : వర్కౌట్స్ సమయంలో నీరసానికి గురికాకుండా ఎనర్జీ అందించే ఫుడ్​ తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఆ క్రమంలో ఏం తినాలో తెలియక చాలా మంది ఏవి పడితే అవి తిని వర్కౌట్స్ చేస్తుంటారు. అలా తీసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి వారి కోసం వ్యాయామానికి ముందు తీసుకోవాల్సిన కొన్ని ఫుడ్స్​ తీసుకొచ్చాం. వీటిని తీసుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్ పొందుతారు. అవేంటంటే..

క్రమంగా శక్తిని విడుదల చేసే తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను ఎంచుకోవాలి. కండరాల శక్తిని పెంపొందించుకోవడానికి మితమైన ప్రోటిన్ సంబంధిత ఆహారాలతో వీటిని యాడ్ చేసుకొని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలు పొందుతారు. అలాగే ప్రీ వర్కౌట్ మీల్స్​కు కొన్ని ఉదాహరణలుగా గుడ్లతో కూడిన హోల్​గ్రెయిన్ టోస్, గింజలతో కూడిన ఓట్​మీల్ లేదా టర్కీ, చీజ్ శాండ్​విచ్ లాంటివి చెప్పుకోవచ్చు. ఇవి జిమ్‌కి వెళ్లే ముందు మీ శరీరానికి సరైన శక్తిని అందించాలనే సూత్రంపై ఆధారపడి ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. వాటికి అదనంగా ప్రొటీన్‌ని చేర్చడం వల్ల వ్యాయామం సమయంలో కండరాల పనితీరుకు మద్దతు లభిస్తుంది.

వ్యాయామం తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్స్ : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. జిమ్​కు వెళ్లొచ్చాం.. బాగా కష్టపడ్డాం.. కాబట్టి ఎనర్జీ కోసం తినాలని ఏవి పడితే అవి ఎక్కువ మొత్తంలో తింటుంటారు. ఇలా తినడం ద్వారా ఫలితం శూన్యం అంటున్నారు. అయితే నిజానికి వర్కౌట్స్ తర్వాత బాడీకి సరైన పోషకాహారం అందించడం ముఖ్యమే కానీ ఎంత మొత్తం తీసుకోవాలి, ఏవి తీసుకోవాలనే దానిపై స్పష్టత అవసరం. కాబట్టి వ్యాయామం తర్వాత తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.

వర్కౌట్స్ తర్వాత కండరాలకు శక్తినవ్వడానికి ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం చిలగడదుంపలతో కాల్చిన చికెన్, చిక్‌పీస్‌తో క్వినోవా సలాడ్, ప్రొటీన్ పౌడర్‌తో చేసిన స్మూతీ, పండ్లు, పెరుగు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం టైమ్​లో ఖర్చయిన కార్బోహైడ్రేట్స్ భర్తీ చేయడం కోసం బ్రౌన్ రైస్, క్వినోవా వంటివి తీసుకోవాలి.

బాడీని హైడ్రేట్​గా ఉంచడం కీలకం : వర్కౌట్స్ చేసే సమయంలో కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడానికి నీరు లేదా స్పోర్ట్స్ డ్రింక్స్​ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వ్యాయామం టైమ్​లో కోల్పోయిన వాటిని తిరిగి పొందడంతో పాటు బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంచుతాయి. అది మీరు యాక్టివ్​గా ఉండి మరింత శ్రమించడానికి, బాడీ రికవరీకి చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక చివరగా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ టైమ్​లో కొవ్వు పదార్థాలు, చక్కెర పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్​కు వీలైనంత వరకు దూరంగా ఉంటేనే బెటర్ రిజల్ట్స్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

Workout Common Mistakes To Avoid : వ్యాయామం చేస్తున్నారా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Weight Loss Tips : అధిక బరువు సమస్యా? టైమ్​కు భోజనం చేయకపోతే ఇంకా నష్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.