ETV Bharat / sukhibhava

మెదడుకు మేలు చేసే బి విటమిన్​ - vitamin b benifits

Vitamn B For Brain Health : మెదడు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. మరి ఆ మెదడు సరిగ్గా పనిచేయాలంటే.. పోషకాహారం ఎంతో అవసరం. మెదడుకు మేలు చేకూర్చే విటమిన్​ బి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

benifits of vitamn b for brain
benifits of vitamn b for brain
author img

By

Published : Sep 28, 2022, 8:54 AM IST

Vitamn B For Brain Health : మెదడు ఆరోగ్యానికి సమతులాహారం తినటం అత్యవసరం. అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు లభించినప్పుడు మెదడు చురుకుగా, సమర్థంగా పనిచేస్తుంది. అయితే అన్నింటిలో కెల్లా బి విటమిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కుంగుబాటు, మతిమరుపు, మానసిక స్థిరత్వం కోల్పోవటం వంటివాటికీ బి విటమిన్ల లోపానికీ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో 8 రకాల విటమిన్లు ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమైనవే. ఇవి మెదడుకు ఎలా మేలు చేకూర్చుతాయో చూద్దాం.

శక్తిని పెంచుతూ
విటమిన్‌ బి1 (థయమిన్‌) కణాలు పనిచేయటంలో, పోషకాల నుంచి శరీరం శక్తిని గ్రహించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో జీవక్రియల పరంగా అత్యంత చురుకుగా ఉండే అవయవాల్లో మెదడు ఒకటి. అంటే నాడీ సమస్యలకు దారితీసే లోపాలు తగ్గటానికి థయమిన్‌ తోడ్పడుతుందన్నమాట.

కొవ్వు ఆమ్లాలకు బాసట
విటమిన్‌ బి5 (పాంటోథెనిక్‌ ఆమ్లం) కోఎంజైమ్‌ ఎ అనే అణు సమ్మేళనం తయారీకి అత్యవసరం. కొవ్వు ఆమ్లాలు ఏర్పడటానికి, శక్తి కోసం వీటిని విడగొట్టటానికి ఎంజైమ్‌లకు తోడ్పడేది ఇదే. అవసరమైన కొవ్వులు ఉత్పత్తి కావటానికి తోడ్పడే అసీల్‌ క్యారియర్‌ ప్రొటీన్ల తయారీలోనూ విటమిన్‌ బి5 పాలు పంచుకుంటుంది. మన మెదడు ప్రధానంగా కొవ్వే. అందువల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

జబ్బులతో పోరాటం
విటమిన్‌ బి6 (పైరిడాక్సిన్‌) జబ్బుల నివారణకు పెట్టింది పేరు. ఎందుకంటే ఇది తగు మోతాదుల్లో ఉంటే పలు క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. మెదడు ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు బాసటగా నిలిచే పలు రసాయనిక ప్రతిచర్యలకూ పైరిడాక్సిన్‌ తోడ్పడుతుంది.

ఎంజైమ్‌లకు సహాయంగా
విటమిన్‌ బి2 (రైబోఫ్లావిన్‌) కణాల్లోని ఎంజైమ్‌లకు సహాయకారిగా పనిచేస్తుంది. ఇలా మెదడు వంటి భాగాల్లో కీలకమైన ప్రతిచర్యల నిర్వహణలో తోడ్పడుతుంది. ఇది కణాలు వృద్ధి చెందటానికి, శక్తి ఉత్పన్నం కావటానికి.. కొవ్వులు, మందుల వంటివి విచ్ఛిన్నం కావటానికీ దోహదం చేస్తుంది.

కణ సమాచార మార్పిడి
విటమిన్‌ బి7 (బయోటిన్‌) కణాల సంకేతాలను నియంత్రిస్తుంది. ఇలా శరీరమంతటా సమాచార మార్పిడి త్వరగా, సమర్థంగా సాగేలా చేస్తుంది. మెదడులోనైతే నాడీ సమాచారవాహికల ద్వారా కణాల సంకేతాల మార్పిడిలో ముఖ్య భూమిక నిర్వహిస్తుంది.

వాపును తగ్గిస్తూ..
విటమిన్‌ బి3 (నియాసిన్‌) 400కు పైగా ఎంజైమ్‌లతో కలిసి శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్, కొవ్వు వంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని శక్తిగా మార్చి, అవయవాలకు అందిస్తుంది. నియాసిన్‌ మంచి యాంటీఆక్సిడెంట్‌ కూడా. అతిగా ప్రేరేపితమయ్యే వాపు ప్రక్రియనూ ఇది అడ్డుకుంటుంది.

సమతుల్యత తప్పకుండా
విటమిన్‌ బి9 (ఫోలేట్‌) మెదడు ఆరోగ్యానికి ప్రధానమైన విటమిన్‌. ఇది నాడీసమాచార వాహికల పనితీరును ఉత్తేజితం చేస్తుంది. మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చూస్తుంది. కణాల్లోంచి విషతుల్యాలు బయటకు వెళ్లి పోవటానికీ తోడ్పడుతుంది.

గుండెకు మేలు
విటమిన్‌ బి12 (కోబలమిన్‌) ఎర్ర రక్తకణాలు, డీఎన్‌ఏ ఏర్పడటానికి అత్యవసరమైన పోషకం. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందటానికి, సమర్థంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే హోమోసిస్టీన్‌ అనే ప్రొటీన్‌ విచ్ఛిన్నం కావటానికీ కోబలమిన్‌ దోహదం చేస్తుంది. ఈ ప్రొటీన్‌ మోతాదులు మితిమీరితే డిమెన్షియాకూ దారితీస్తుంది. పెరుగు, గుడ్లు, పప్పులు, సాల్మన్‌ చేపలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆకు కూరలను తరచూ తీసుకుంటే అన్నిరకాల బి విటమిన్లు లభించేలా చూసుకోవచ్చు.

ఇదీ చదవండి: తరచూ పీడకలలు వస్తున్నాయా? అయితే కాస్త ఇబ్బందే!

గుండెపోటుకు ఎన్నో కారణాలు.. మరి రాకుండా ఉండాలంటే ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.