దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి6, ఐరన్, పీచు లాంటి ఎన్నో పోషకాలుంటాయి.
- యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
- రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె జబ్బుల బారిన పడకుండా చేస్తుంది.
- బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు నుంచి రక్షణ కల్పిస్తుంది.
- రక్తహీనతను నివారిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
- రక్తనాళాల్లో ఉండే అడ్డంకులనుతొలగించి రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది.
- దీంట్లోని క్యాల్షియం ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
- చిగుళ్లవాపు, నొప్పి లాంటి దంత సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.
- నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నప్పుడు దీని రసం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
ఇదీ చూడండి:అసోం గజగజ.. వరదలకు 89 మంది మృతి