Banana Peel Benefits for Face in Telugu : మన శరీరంలో చర్మం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అతి పెద్ద అవయవం కూడా అదే. చర్మ సౌందర్యం, సంరక్షణ కోసం రకరకాల మెడిసిన్, పదార్థాలు వాడతారు. కొందరు సహజ ఉత్పత్తుల్ని వాడితే.. మరికొందరు కాస్మోటిక్స్ వాడతారు. అయితే.. చర్మ రక్షణకు మన వంటింట్లో ఉండే పదార్థాలే ఉపయోగపడతాయి. పసుపు, పాలు లాంటివి చాలా మంది విరివిగా వాడతారు.
Banana Peel For Skin : ఇవి కాకుండా.. అరటి పండును కూడా ఆ జాబితాలో చేర్చవచ్చు. కానీ పండు కాదు.. వాటి తొక్కలు మన చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇందులో మన చర్మానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీ డైలీ బ్యూటీ రొటీన్‌లో అరటిపండు తొక్కలను చేర్చుకోవడం వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే ఎప్పుడైనా అరటి పండు తిన్న తర్వాత తొక్కను పడేయకుండా చర్మ సంరక్షణకు ఉపయోగించుకోండి.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండే అరటి తొక్క.. మన చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడంతో పాటు ముడతలను తగ్గించడంలో సాయపడుతుంది. అంతేకాకుండా ఇది మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలోనూ తగిన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మన బడ్జెట్లో దొరికే వీటితో మంచి ప్రయోజనాలు పొందండి. అరటి తొక్కలను ఉపయోగించడం వల్ల కలిగే 5 ముఖ్యమనై చర్మ ప్రయోజనాలివే.
సహజమైన మాయిశ్చరైజర్‌లా..
అరటి తొక్కల్లో ఉండే సహజమైన తేమ ఉంటుంది. అందువల్ల ఇది మన చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా సహజమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఈ తొక్కల్ని మన చర్మానికి రాసుకోవడం వల్ల అది మృదువుగా తయారవుతుంది.
మృత కణాల్ని తొలగిస్తుంది
Banana Peel On Skin : చూడటానికి సున్నితమైన ఆకృతిలో ఉండే అరటి తొక్కలు.. మన చర్మానికి మంచి సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ అందిస్తాయి. అంటే ఇది మృత కణాల్ని తొలగించే ప్రక్రియ. తొక్కల్ని మన చర్మం మీద రాసుకోవడం వల్ల అవి మృత కణాల్ని తొలగిస్తాయి. ఫలితంగా చర్మం మెరుస్తూ మరింత ఛాయతో కనిపిస్తుంది.
మొటిమల నివారిణి
Banana Peel On Face For Acne : యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న అరటి తొక్కలు మొటిమలు, వాటి బాధ నుంచి విముక్తి కలిగిస్తాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మంటను తగ్గించి, చికాకుగా ఉన్న చర్మానికి ఉపశమనం అందిస్తుంది.
యవ్వనంగా కనిపించేలా..
అరటి తొక్కలు యాంటీ ఏజింగ్ ఆర్సెనల్‌కు దోహదం చేస్తాయి. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిలో తోడ్పడతాయి. ఇది చర్మంపై గీతలు, ముడతలు తగ్గించి యవ్వనంగా ఉంచేందుకు సాయపడుతుంది.
చర్మం మెరిసేందుకు..
అరటిపండు తొక్కలలో ఉండే ఎంజైమ్‌లు.. అసమానమైన చర్మపు రంగు, హైపర్ పిగ్మెంటేషన్‌ను పరిష్కరించగలవు. తొక్కల్ని రెగ్యులర్‌గా మన చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల అది ప్రకాశంగా కనిపించి మెరుస్తుంది.
Pimples Removal Tips : మొటిమల సమస్యా?.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్!
Coconut Health Benefits In Telugu : అధిక బరువు, జుట్టు సమస్యలకు కొబ్బరితో చెక్!