ETV Bharat / sukhibhava

ఆయుర్వేద చిట్కాలతో చెడు కొలెస్ట్రాల్​కు చెక్.. వంటింట్లో దొరికే ఈ సూపర్ ఫుడ్​తో..

Ayurvedic Food to Reduce Cholesterol : ప్రస్తుతం చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దానికి కారణం శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవటమే. చెడు కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో చూపించే సహజమైన పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

Ayurvedic Remedies to Reduce Cholesterol

author img

By

Published : Aug 9, 2023, 8:18 PM IST

Ayurvedic Remedies to Reduce Cholesterol : కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామాలు చేయకపోవటం లాంటి వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. పోషకాహారానికి బదులు ఆరోగ్యానికి నష్టం చేసే జంక్ పుడ్స్​ను తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం లాంటివి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవచ్చు.

Cholesterol Reducing Foods : చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి ఆహారపు అలవాట్లల్లో మార్పులు, వ్యాయామాలు చేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెడతారు. కొలెస్ట్రాల్ తగ్గించకునేందుకు మన సంప్రదాయ ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్​ను పెంచుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు ఏంటో చూద్దాం.

తేనె
Honey For Cholesterol Reduction : రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా తేనె పనిచేస్తుంది. ప్రతి రోజూ కప్పు వేడి నీటిలో టీస్పూన్ తేనె, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్​ను కలిపి తీసుకుంటే మంచిది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్తపడొచ్చు.

వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్.. అధిక కొలెస్ట్రాల్​ తగ్గించటంలో సహాయం చేస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసుకొని, దానిని 50 మి.లీ పాలు, 200మీ.లీ నీటిలో వేసి మరిగించి తీసుకోవాలి.

పసుపు
Turmeric Benefits For Cholesterol : పసుపు రక్తనాళాల్లో కొవ్వును చేరకుండా ఉండేలా చేస్తుంది. పసుపును తరచుగా కూరల్లో వాడతాం. వంకాయ గుజ్జు, పసుపును సమపాళ్లలో తీసుకోవాలి. వాటిని నీటితో కలిపి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రైడ్​ స్లైడ్స్ మధ్య పెట్టి భోజనం తరవాత ఆరగించాలి.

మెంతులు
మెంతుల్లో పొటాషియం, ఐరన్, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ తగ్గుతుంది. ఒక చెంచా మెంతి పొడిని గోరువెచ్చని నీటితో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్​కు చెక్ పెట్టవచ్చు.

ధనియాలు
ధనియాలు చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తాయి. ఇవి మధుమేహ రోగులకు కూడా బాగా ఉపయోగపడుతాయి. కప్పు నీళ్లలో రెండు టీస్పూన్ల పసుపు వేసి పాలు, పంచదార, యాలకుల పోడి వేసి మరిగించి రోజుకు రెండు సార్లు తాగాలి.

యాపిల్స్
యాపిల్​లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. రోజూ యాపిల్ తింటే ఉపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్​ను దాని పైతొక్కుతో సహా తినాలి. ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది.

బీట్​రూట్​
బీట్​రూట్​ చెడు కొలెస్ట్రాల్​ను నియంత్రించటంలో ఉపయోగపడుతుంది. బీట్​రూట్​ను రసం చేసుకొని తాగాలి. ఇతర జ్యూసులతో కలిపి తీసుకున్నా మంచిదే.

యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది. గ్లాసు నీళ్లలో టీస్పూన్​ యాపిల్ సైడర్ వెనిగర్​ను కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

బచ్చలికూర
బచ్చలికూర రక్తనాళాల్లో కొవ్వును చేరకుండా ఉండేలా చేస్తుంది. దీనిని సలాడ్ లాంటి వాటిల్లో తీసుకోవటం మంచిది.

పెసర పప్పుతో అధిక బరువుకు చెక్.. ఈ డిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తారా?

Belly Fat Effects On Health : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఇలా చేస్తే అంతా సెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.