త్రిఫలాలుగా పేర్కొనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలు లివర్‌కు యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు. శరీరంలోని మలినాలను బయటక పంపించే ఈ పదార్థాల ద్వారా లివర్ దెబ్బ తినకుండా నివారించడం సహా ఆరోగ్యంగా ఉంచొచ్చని చెప్తున్నారు. వీటితో ఔషధ గుణాలు గల ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే..
కావాల్సిన ద్రవ్యాలు- నెయ్యి, పాలు, పసుపు, త్రిఫలాలు, వేపాకుల చూర్ణం, బలావేర్ల చూర్ణం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పత్యాహారం తయారీ విధానం..
- ఓ గిన్నెలో నీళ్లు, పాలు పోసి కాచాలి. పాలు ఎంత తీసుకున్నామో అందులో నాలుగో వంతు నెయ్యిని వెయ్యాలి.
- ఇందులో ఇప్పుడు త్రిఫలాల చూర్ణాన్ని వెయ్యాలి. ఈ మూడింటిని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ త్రిఫలాలు కొత్త కణాల ఉత్పత్తికి తొడ్పడతాయంటున్నారు నిపుణులు.
- రక్తశుద్ధికి తోడ్పడే వేపాకు చూర్ణం సహా పసుపు 25 గ్రాములు ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులో అదనంగా బలావేర్ల చూర్ణాన్ని ఓ 25 గ్రాములు కలపాలి.
ఈ ద్రవ్యాలన్నింటిని కలిపి సన్నటి మంటపై కాగనివ్వాలి. నీటి శాతం పోయి కేవలం నెయ్యి మిగిలే వరకు వాటిని కాగనివ్వాలి.
ఈ మిశ్రమాన్ని ఓ అరకప్పు వేడి వేడి పాలల్లో ఓ పెద్ద చెంచా పరిమాణంలో వేసి కలుపుకొని ప్రతిరోజు పరిగడుపునే తీసుకోవాలి. ఇలా రోజు తీసుకుంటే.. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
ఇదీ చూడండి: పిల్లలు రాత్రిళ్లు బాగా నిద్రపోతున్నారా? అయితే లావు అవ్వరట!