ETV Bharat / sukhibhava

ఇలా యోగా చేస్తే ఇక మీ పని అంతే ఇక! - ఆరోగ్య సమాచారం

శరీరానికి వ్యాయామం, మనసుకు ప్రశాంతతను ఏకకాలంలో అందించే అద్భుతమైన ప్రక్రియ ‘యోగా’. అందుకే చాలామంది కఠినమైన వ్యాయామాలతో జిమ్‌లో కసరత్తులు చేసే బదులు.. ఇంటి పట్టునే ఉంటూ యోగాసనాలు సాధన చేయడానికే మొగ్గుచూపుతుంటారు. అయితే ఎలా చూసినా యోగా వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువ. కానీ దీనివల్ల దుష్ప్రభావాలూ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అదేంటి.. అని ఆశ్చర్యపోకండి.. యోగాసనాలు వేసే క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్లే ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశమున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. మరి, ఇంతకీ యోగా వల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్స్‌ ఏంటి? అవి ఎలా ఎదురవుతాయి? తెలుసుకుందాం రండి..

avoid these mistakes while doing yoga in telugu
ఇలా యోగా చేస్తే ఇక మీ పని అంతే ఇక!
author img

By

Published : Jul 29, 2020, 6:07 AM IST

కంఫర్ట్‌ జోన్‌ దాటారా..?

రోజూ యోగా చేయాలనుకుంటాం.. అందుకు చక్కటి ప్రణాళిక కూడా వేసుకుంటాం.. కానీ రోజూ ఆలస్యంగా నిద్ర లేస్తూ గబగబా యోగాసనాలు వేసేస్తుంటాం. ఈ క్రమంలో కొందరు ఆసనాలు సాధన చేసే క్రమంలో గాలి పీల్చి వదిలే ప్రక్రియను సరిగ్గా చేయరు.. అంతేకాదు.. ఇంకొందరైతే కఠినమైన ఆసనాన్ని బలవంతంగా చేసేస్తుంటారు. ఇలాంటి పొరపాట్ల వల్ల కండరాలు, ఎముకలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఆయా భాగాల్లో తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం కూడా ఉంది. కాబట్టి యోగా చేసేటప్పుడు మన శరీరాన్ని కంఫర్ట్‌ జోన్‌లోనే ఉంచుకోవాలి. అంటే సౌకర్యవంతంగా ఉండే యోగాసనాల్ని మాత్రమే చేయాలి. ప్రాక్టీస్‌ అయ్యే కొద్దీ నిపుణుల పర్యవేక్షణలో కఠినమైన యోగాసనాలు సాధన చేయాలే తప్ప.. ముందే అన్నీ చేసేయాలనే ఆదుర్దా వద్దు.

ఫ్లెక్సిబుల్‌గా మారక ముందే..!

సాధారణంగా మనకు ఏదైనా నేర్చుకోవాలని అనిపిస్తే అందులో ఇంకా ఇంకా లోతుకు వెళ్లాలనుకుంటాం. యోగాకు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడిప్పుడే యోగా నేర్చుకుంటున్న వారికి కొన్ని కఠినమైన ఆసనాలు చూస్తే వెంటనే చేసేయాలనే ఆతృత వారిలో ఉండడం సహజం. కానీ అందుకు చాలా ప్రాక్టీస్‌ కావాలి. ఆయా ఆసనాలు వేయడానికి శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారుకావాలి. అందుకోసం నిపుణుల పర్యవేక్షణలో సాధన చేస్తూ వాటిని సులభంగా చేసే మార్గాలేంటో తెలుసుకోవాలి. అలాకాకుండా ఎలాంటి సాధనా చేయకుండా కఠినమైన ఆసనాలు వేసేస్తామంటే ఆయా భాగాలపై ఒత్తిడి పడి గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

అతి ఏదైనా ప్రమాదమే!

వ్యాయామం చేయడానికీ ఓ కచ్చితమైన సమయమంటూ ఉంటుంది. అలాకాకుండా వెంటనే నేను ఫిట్‌గా మారాలి, బరువు తగ్గాలి, నా మానసిక ఒత్తిళ్లన్నీ మటుమాయమైపోవాలి.. అనే ఆలోచనలతో రోజులో ఎక్కువ సమయం యోగాకు కేటాయిస్తే మాత్రం అలసట తప్పదంటున్నారు నిపుణులు. ఇలా అతిగా యోగా చేయడం వల్ల శరీర అవయవాలపై ప్రతికూల ప్రభావం పడి లేనిపోని అనారోగ్యాలూ చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీకేమైనా సందేహాలున్నా, లేదంటే ఏ ఆసనానికి ఎంత సమయం కేటాయించాలో తెలియకపోయినా మీకు తెలిసిన యోగా ఎక్స్‌పర్ట్‌ని కాంటాక్ట్‌ చేస్తే సరి!

డిజిటల్‌ అయినా అజాగ్రత్త వద్దు!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి వ్యాయామమైనా ఇంట్లోనే చేయడానికి ఇష్టపడుతున్నారంతా! అలా చేయడమే మంచిది కూడా! అయితే ఈ క్రమంలో ఆన్‌లైన్‌ వీడియోలను, డిజిటల్‌ తరగతులను ఫాలో అయిపోతున్నారు. ఇలా వాటిని చూస్తూ వ్యాయామం చేసేటప్పుడు మీకు నచ్చినట్లుగానో, లేదంటే ఎవరో చెప్పారనో కాకుండా ఆ వీడియోలో శిక్షకులు ఎలా చెప్తే అలా ఫాలో కావాలి. లేదంటే తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని ఆసనాల్లో మెడలు, నడుమును పక్కలకు, ముందుకు-వెనక్కి వంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ వీడియోలో నిపుణులు ఎటువైపు తిప్పాలంటే అటువైపు తిప్పడం, అలాగే ఒక క్రమ పద్ధతిలో ఆసనం వేయడం, తిరిగి అదే పద్ధతిలో రిలాక్సవడం.. చాలా ముఖ్యం. తద్వారా కండరాలు, కీళ్లు, నరాలు బిగుసుకుపోయే సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

  • అన్నీ నాకే తెలుసు అని కాకుండా.. కొత్త ఆసనం సాధన చేసేటప్పుడు ఒకసారి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
  • అలాగే మీరు ఒక ఆసనాన్ని కొత్తగా సాధన చేస్తున్నప్పుడు.. దాన్ని అలా చేయాలి, ఇలా చేయాలి.. అంటూ అందులో మీరే ఎక్స్‌పర్ట్‌ అన్నట్లుగా ఇతరులకు ఆ ఆసనాన్ని నేర్పించకండి. తద్వారా ఇటు మీకు, అటు వారికీ ప్రమాదమే!
  • ఏ వ్యాయామానికైనా ముందుగా వార్మప్‌ తప్పనిసరి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని కీళ్లు, కండరాలు వ్యాయామం చేయడానికి ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.
  • యోగా, ఇతర వ్యాయామాలు.. ఇలా ఏది చేసేటప్పుడైనా శరీరం మాట మీరు వినాలి కానీ.. మీ మాట మీ శరీరం వినేలా చేయకూడదు. అలా మీ శరీరాన్ని బలవంతపెడితే అది మీకే నష్టం.
  • ఒకవేళ మీరు ఎంత జాగ్రత్తగా ఆసనాలు వేసినా ఇతర శారీరక నొప్పులు, గాయాలు వేధిస్తుంటే మాత్రం మీ సొంత వైద్యం కాకుండా నిపుణుల్ని సంప్రదించడం మంచిది. వీలుకాని పక్షంలో ఫోన్లోనే సలహాలు తీసుకోవచ్చు.

నిజానికి ఈ పొరపాట్లన్నీ మనకు తెలిసినవే.. కానీ చేసేటప్పుడు ‘ఇలా చేయకూడదు కదా’ అన్న విషయం గుర్తుకు రాకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇకపై వీటిని పునరావృతం కాకుండా జాగ్రత్తపడదాం.. చక్కగా యోగా చేసేద్దాం.. ఆరోగ్యాన్ని-ఆనందాన్ని మన సొంతం చేసుకుందాం..!

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.