ETV Bharat / sukhibhava

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం! - Healthy Eyes Tips

Best Tips for Eyes Healthy : ఈ రోజుల్లో చాలా మంది చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణపై చూపే శ్రద్ధ కళ్ల ఆరోగ్యంపై చూపట్లేదు. దాంతో చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవే కాదు మనం డైలీ చేసే కొన్ని మిస్టేక్స్ కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Best Tips for Healthy Eyes
Best Tips for Healthy Eyes
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 12:39 PM IST

Avoid These Mistakes for Eyes Healthy : శరీరంలో అన్నింటికంటే కళ్లు చాలా ముఖ్యమైన అవయవాలు. అందుకే 'సర్వేంద్రియం నయనం ప్రధానం' అంటారు పెద్దలు. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కళ్లకు ఎలాంటి హాని కలగకుండా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం పెరిగిన స్మార్ట్​ఫోన్ల వాడకం, కాలుష్యం, ఆహారపు అలవాట్లు.. ఇలా పలు కారణాల వల్ల చాలా మంది వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇవే కాదు.. తెలిసి తెలియక మనం నిత్యం చేసే కొన్ని సాధారణ పొరపాట్లు కూడా కళ్ల(Eyes) ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. వాటి కారణంగా కూడా కంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ తప్పులు చేయకుండా ఉండాలంటున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వెచ్చని నీటిని ఉపయోగించడం : మనలో చాలా మంది చలికాలం వచ్చిందంటే చాలు కళ్లతో సహా ముఖాన్ని వేడి నీటితో కడుక్కోవడం మొదలుపెడతారు. అయితే ఇది కంటికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా కాకుండా కళ్లను ఎప్పుడూ వేడి నీటితో కాకుండా రూమ్​ టెంపరేచర్​కు అనుగుణంగా ఉన్న నీరు లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలంటున్నారు.

తరచుగా రెప్పవేయకపోవడం : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్​ఫోన్లు, కంప్యూటర్స్, ల్యాప్​టాప్​ల వినియోగం పెరిగింది. దాంతో చాలా మంది వాటిని చూసే క్రమంలో తరచుగా రెప్ప వేయకుండా అలాగే స్క్రీన్ చూస్తూ ఉండిపోతాం. ఇది కూడా కళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అలా కాకుండా తరచుగా రెప్పవేయడానికి ట్రై చేయాలని సూచిస్తున్నారు. వాస్తవంగా రెప్పవేయడం సహజమైన శారీరక ప్రక్రియ.

కళ్లు రుద్దడం : ఇక మనలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏ కారణం చేతనైనా తరచుగా కళ్లు రుద్దడం. అయితే కళ్లు అనేవి కండ్లకలక నుంచి రక్షణ పొందేందుకు చాలా సన్నని పొరను కలిగి ఉంటాయి. రుద్దడం ద్వారా అది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రుద్దే బదులు చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలాగే రుద్దడం ద్వారా పైన ఉన్న బ్యాక్టీరియా, మురికి కళ్లలోకి వెళ్తాయి. దీనివల్ల కంటిశుక్లాలు, మచ్చలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

ఐ డ్రాప్స్ ఎక్కువగా ఉపయోగించడం : ఈరోజుల్లో కంటి సమస్యలు పెరగడంతో చాలా మంది ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ యూజ్ చేస్తున్నారు. కళ్ల ఆరోగ్యం కోసం వాటిని రోజూ వాడడం మంచిదే అయినా అవి కూడా హాని కలిగిస్తాయి. అయితే ఐ డ్రాప్స్ దీర్ఘకాలం ఉపయోగించడం ద్వారా మీ కళ్లు మరింత పొడిగా మారుతాయి. ఆయుర్వేద పరంగా ఆయిల్ ఆధారితమైన కంటి చుక్కల మందులు ఎక్కువకాలం యూజ్ చేయడానికి ఉత్తమమైనవిగా చెప్పుకోవచ్చు.

నిద్ర కోసం వెచ్చని కంటి మాస్క్​లు ఉపయోగించడం : మనలో కొందరు నిద్రపోవడానికి వార్మ్ ఐ మాస్క్​లు ఉపయోగించడం అలవాటు చేసుకుంటారు. కానీ, అవి కంటికి మంచిది కాదు. అలాగే కంటి ఇన్ఫెక్షన్‌లు​ మొదలైన వాటి కోసం హాట్ ప్యాక్‌లను ఉపయోగించడం మానుకోవాలి. అలాకాకుండా మీ కళ్లను రాత్రిపూట స్వేచ్చగా ప్రశాంతంగా ఉండనివ్వండి. అవసరమైతే ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి కోసం కోల్డ్ ప్యాక్‌ని ఉపయోగించడం మంచిది.

చూశారుగా.. ఈ పొరపాట్లకు వీలైనంత దూరంగా ఉంటూ మంచి ఆహారాన్ని తీసుకున్నారంటే మీ కళ్లు ఆరోగ్యంగా.. తద్వారా అందంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

మీ కళ్లు ఎర్రగా మారుతున్నాయా? - ఈ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి!

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ - నిద్ర చాలకనే వచ్చాయనుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.