ETV Bharat / sukhibhava

ఇలా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూనే ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట! - telangana varthalu

ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ప్రస్తుతం ఎక్కడ విన్నా, ఎవరు మాట్లాడుకున్నా దీని గురించే! మాయదారి కరోనా మహమ్మారి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసి శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు పతనమయ్యేలా చేస్తోంది. దీంతో ఊపిరి అందక బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు హాస్పిటల్స్‌లో బెడ్లు దొరక్క, అక్కడా ప్రాణవాయువు కొరతతో ప్రాణాలరచేత పట్టుకొని ఆక్సిజన్‌ కోసం ఆస్పత్రి బయటే నిరీక్షిస్తున్నారు. ఇంకొంతమందైతే హోమ్ ఐసొలేషన్‌లో ఉండి, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్నా.. వైరస్‌ భయంతో సిలిండర్‌తో సహా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరి, ఆక్సిజన్‌ తగ్గిన ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలోనే చికిత్స అందించాలా? అంటే.. ఆ అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పరిస్థితి అదుపులో ఉండి, ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో ఉంటే ఇంట్లోనే హోమ్ ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి పడకలు దొరికే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ సిలిండర్‌ లేకపోయినా.. ప్రోనింగ్‌ పద్ధతి ద్వారా సహజసిద్ధంగా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయుల్ని పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మరి, మన శరీరంలో ఆక్సిజన్‌ స్థాయుల్ని ఎలా చెక్‌ చేసుకోవచ్చు? ఒకవేళ తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అత్యవసర పరిస్థితుల్ని ఎలా గుర్తించచ్చు? కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన ఈ ‘ప్రోనింగ్‌’ పద్ధతేంటి? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి..

proning technique
ఇలా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూనే ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట!
author img

By

Published : Apr 25, 2021, 5:50 PM IST

సాధారణంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. తద్వారా ఆయా అవయవాల పనితీరు చురుగ్గా ఉంటుంది. అదే.. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతే దాని ప్రభావం ఊపిరితిత్తులతో పాటు అన్ని శరీర భాగాలపై పడుతుంది. కరోనా కారణంగా ప్రస్తుతం చాలామందిలో ఇలాంటి సమస్యే తలెత్తుతోంది. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు 94-100 మధ్యలో ఉన్నట్లయితే మనకు తగినంత ప్రాణ వాయువు అందుతున్నట్లు లెక్క! అదే ఈ స్థాయులు 91-94 మధ్యలో నమోదైతే ఆక్సిజన్ లెవెల్స్​ని తరచూ పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇక 91 కంటే దిగువకు పడిపోయినా, ఎక్కువ సమయం పాటు అలాగే కొనసాగినా వైద్య చికిత్స అవసరమవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆక్సీమీటర్‌ సహాయంతో మన శరీరంలో ఆక్సిజన్‌ స్థాయుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సి ఉంటుంది.

డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడెళ్లాలి?

ఇలా ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగని ఈ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్పత్రి అవసరం ఉంటుందా అంటే.. లేదంటున్నారు ఎయిమ్స్‌ వైద్యులు. అయితే బాధితులు తమ ఆరోగ్యం విషయంలో కొన్ని లక్షణాలను గమనిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్లాలంటున్నారు. అవేంటంటే..!

  • ఆక్సిజన్‌ స్థాయులు 91 కంటే దిగువకు చేరుకొని క్రమంగా తగ్గుతుండడం.. రెండు గంటలకు పైగా ఇలాంటి పరిస్థితే కొనసాగడం.
  • ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్న వారిలో కొవిడ్‌ కారణంగా ఆక్సిజన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఎదురుకావడం.
  • చర్మం, పెదాలు నీలం రంగులోకి మారడం. దీన్నే వైద్య పరిభాషలో సయనోసిస్ గా పేర్కొంటున్నారు వైద్యులు. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు బాగా పడిపోయినప్పుడు ఇలా జరుగుతుందట! ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి పరుగుపెట్టాల్సిందేనంటున్నారు.
  • సాధారణంగా మన రక్తంలో ఆక్సిజన్ స్థాయులు సరిపడినంత మోతాదులో ఉంటే చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. అదే వాటి స్థాయులు బాగా పడిపోతే క్రమంగా ముఖ చర్మం రంగు మారిపోతుందంటున్నారు నిపుణులు. అంటే.. ఆస్పత్రిలో చేరాల్సిన సమయం ఆసన్నమైందని దీని అర్థమట!
  • ఛాతీలో విపరీతమైన నొప్పి రావడం.. ఛాతీపై భరించలేనంత ఒత్తిడి పెట్టినట్లుగా అనిపించడం.
  • నిరంతరాయంగా దగ్గు రావడం.
  • విపరీతమైన తలనొప్పి, అలసట వేధించడం.
  • క్రమంగా తగ్గే ఆక్సిజన్‌ స్థాయులు మెదడు పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయట! తద్వారా ఏకాగ్రత లోపించడం, చూపు మందగించడం, మైకం కమ్మినట్లుగా అనిపించడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మరో ఆలోచన లేకుండా ఆస్పత్రికి వెళ్లి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

‘ప్రోనింగ్‌’తో ప్రాణవాయువు అందుతుందట!

ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైన వారంతా భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. నిజానికి ఆ అవసరం లేదని, ఇంట్లోనే ‘ప్రోనింగ్‌’ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్‌ స్థాయుల్ని మెరుగుపరచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ మేరకు ఇటీవలే ఈ పద్ధతికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.

  • ప్రోనింగ్‌ అనేది వైద్యపరంగా అంగీకరించిన ఒక సురక్షితమైన పద్ధతి. ఇందులో భాగంగా ముఖం కిందికి పెట్టి బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తుల్లో ఉండే అల్వియొలార్ యూనిట్స్‌ తెరుచుకుంటాయి. ఫలితంగా ఊపిరి అందుతుంది.. సౌకర్యవంతంగానూ అనిపిస్తుంది.
  • ఆక్సిజన్‌ స్థాయులు 94 కంటే పడిపోతే ఈ పద్ధతి అవసరమవుతుంది.
  • హోమ్ ఐసొలేషన్‌లో ఉన్న వారు ప్రోనింగ్‌ చేయడంతో పాటు ఆక్సిజన్‌ స్థాయులు, శరీర ఉష్ణోగ్రత, బీపీ, షుగర్ లెవెల్స్.. వంటివి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
  • ఆక్సిజన్‌ స్థాయుల్ని గుర్తించడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అది హైపోక్సియా (ఆక్సిజన్‌ స్థాయులు బాగా పడిపోవడం)కు దారితీయచ్చు. తద్వారా పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదమూ ఉంటుంది. అందుకే సమయానికి ప్రోనింగ్‌ పద్ధతిని పాటిస్తే ఈ విపత్తు నుంచి బయటపడచ్చు.

ఎలా చేయాలంటే..?!

  • ప్రోనింగ్‌ ప్రక్రియలో భాగంగా ఐదు దిండ్లు అవసరమవుతాయి. ఒక దిండును మెడ కింద, ఒకటి లేదా రెండు దిండ్లను ఛాతీ కింద (తొడల పైభాగం వరకూ కవరయ్యేలా), మరో రెండు దిండ్లను మడమ ముందు భాగం (మోకాళ్ల కింద భాగం)లో పెట్టుకోవాలి. ఈ పొజిషన్‌లో అరగంట పాటు ఉండాలి.
  • ఇక ఎక్కువ సమయం మంచంపై విశ్రాంతి తీసుకునే బాధితులు ఒకే భంగిమలో కాకుండా ఈ కింద బొమ్మలో చూపినట్లు పలు భంగిమల్లో పడుకోవచ్చు. అయితే ఒక్కో భంగిమలో అరగంట పాటు ఉండాల్సి ఉంటుంది.

ఇవి గుర్తుపెట్టుకోండి!

  • భోజనం తర్వాత గంట వరకూ ప్రోనింగ్‌ ప్రక్రియ పాటించకూడదు.
  • తేలిగ్గా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ఇలా చేయాలి. ఇందుకోసం శరీరాన్ని బలవంత పెట్టద్దు.
  • వైద్యుల సూచనల మేరకు ఒక వ్యక్తి రోజుకు సుమారు 16 గంటల పాటు వివిధ భంగిమల్లో ప్రోనింగ్‌ చేయచ్చు.. అది కూడా సౌకర్యవంతంగా అనిపిస్తేనే!
  • ఈ క్రమంలో మీ సౌకర్యాన్ని బట్టి దిండ్లను కూడా ఎప్పటికప్పుడు సరిచేసుకోవచ్చు.
  • ప్రోనింగ్‌ పద్ధతిలో ఏవైనా గాయాలైనా వాటి గురించి నిపుణులకు రిపోర్ట్ చేయాలి.
  • గర్భిణులు, వెన్నెముక సమస్యలున్న వారు, గుండె జబ్బులతో బాధపడే వారు, కటి వలయానికి సంబంధించిన సమస్యలున్న వారు ప్రోనింగ్‌కు దూరంగా ఉండాలి.

కాబట్టి ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయాయంటూ అనవసరంగా ఆందోళన చెందకుండా ముందు వాటి స్థాయుల్ని పరీక్షించుకోండి.. తద్వారా మీకు ఆస్పత్రి అవసరమో, కాదో అర్థమవుతుంది. దాన్ని బట్టి నిపుణుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవచ్చు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడదు.

బీ బ్రేవ్‌.. స్టే సేఫ్!

ఇదీ చదవండి: ఈ సూపులు.. రోగనిరోధక శక్తిని పెంచేస్తాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.