ETV Bharat / sukhibhava

ఈ లక్షణాలు ఉన్నాయా? బ్లాక్​ ఫంగస్​ కావచ్చు!

కరోనాతో పాటు ఇప్పుడు బ్లాక్​ ఫంగస్​ దేశ ప్రజలను వెంటాడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాధిని సాంక్రమిక వ్యాధి చట్టం-1897 కింద గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్​ ఫంగస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దాని లక్షణాలు, వ్యాప్తి వంటి విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.

all-you-need-to-know-about-black-fungus
నలుపు రంగులోకి ముక్కు- బ్లాక్​ ఫంగస్​ ఎఫెక్ట్​!
author img

By

Published : May 20, 2021, 6:54 PM IST

Updated : May 20, 2021, 10:35 PM IST

బ్లాక్​ ఫంగస్​ను సాంక్రమిక వ్యాధి చట్టం- 1897 కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. దేశంలో బ్లాక్​ ఫంగస్​ తీవ్రత గురించి చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఈ వ్యాధి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయన్న వార్తలు ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధికి సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తల గురించి తెలుసుకోవడం అత్యావశ్యకం.

ముప్పు ఎవరికి?

బ్లాక్​ ఫంగస్​ను మ్యూకోర్ మైకోసిస్ అని అంటారు. మధుమేహం ఉన్న వారు కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ సులభంగా సోకుతుంది. అందువల్ల.. చక్కెర నిల్వలు అధికంగా ఉన్న, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కరోనా రోగుల్లో దీని ముప్పు ఎక్కువ. కేన్సర్, అవయువ మార్పిడి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు, ఒరికొనజోల్ చికిత్స తీసుకున్న వారికీ ముప్పు ఎక్కువే.

ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పలు సందర్భాల్లో చూపు కోల్పోయిన వారూ ఉన్నారు.

లక్షణాలేంటి?

  • సైనసైటిస్-ముక్కుదిబ్బడ, నలుపు రంగులో ముక్కుకారటం, దవడ, చక్కిళ్లు నొప్పి
  • మొహంపై ఒక వైపు నొప్పి, తిమ్మిరి, వాపు
  • ముక్కుదూలంపై, అంగళిపై నలుపు రంగు
  • పంటి నొప్పి, వదులు పళ్లు, దవడ నొప్పి
  • అస్పష్ట కంటి చూపు, నొప్పి, జ్వరం, చర్మంపై పుండ్లు
  • ఛాతీలో నొప్పి, దగ్గితే రక్తం, ఆయాసం

జాగ్రత్తలేంటి?

రక్తంలో చక్కెర అదుపులో ఉంచుకోవాలి. స్టెరాయిడ్స్ వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి. గదిలో పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛమైన నీటినే హ్యుమిడిఫైయర్స్ (ఎయిర్ కూలర్స్)లో వాడాలి. యాంటి బయాటిక్స్ / యాంటి ఫంగల్స్ వాడకంలో నియంత్రణ ఉండాలి.

ఇదీ చూడండి:- దేశంలో మరో కొత్త వ్యాధి.. ఈసారి వైట్​ ఫంగస్​

Last Updated : May 20, 2021, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.