ETV Bharat / sukhibhava

ఆ ప్రాంతాల ప్రజలు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ!

వాయు కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం కలుషితమైన గాలి పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని వెల్లడించింది ఓ సర్వే. గుండె జబ్బులతో బాధపడుతున్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Air pollution
జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ!
author img

By

Published : Apr 13, 2020, 9:46 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కలుషిత వాతావరణంలో ఉండే వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. వాయు కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారిలో జ్ఞాపక శక్తి తగ్గి మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది ఓ సర్వే. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.

స్వీడన్​లోని కరోలిన్స్కా ఇన్​స్టిట్యూట్​కు చెందిన కొందరు​​ పరిశోధకులు వాయు కాలుష్యం ఉన్న నగరాలపై పరిశీలన చేసి నివేదిక రూపొందించారు.

30 ఏళ్లలో మూడు రెట్లు

ఈ వాయు కాలుష్యం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే వారి సంఖ్య రానున్న 30 ఏళ్లలో మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సమస్య నివారణకు ఇప్పటి వరకు చికిత్స లేనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వృద్ధులపై పరిశోధన

స్వీడన్​ పరిశోధకులు 74 ఏళ్ల వయసున్న దాదాపు 3 వేల మంది వృద్ధులపై అధ్యయనం చేశారు. సుమారు 11 ఏళ్ల వరకు వారిని గమనించారు. వీరిలో 364 మందికి జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు తగ్గి మతిస్థిమితం కోల్పోయే స్థితికి చేరుకున్నారని వెల్లడించారు.

" కలుషితమైన గాలి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతూ మానసిక స్థితి కోల్పోయేలా ఈ వాయు కాలుష్యం కారణమవుతుందని గుర్తించాం. హృదయ సంబంధిత వ్యాధులున్న వారిలో ఈ ప్రమాదం అధికంగా ఉంది. 50 శాతం మందికి అకస్మాత్తుగా గుండె నొప్పి రావడానికి ఇదే కారణం."

- గియులియా గ్రాండే, కరోలిన్స్కా ఇన్​స్టిట్యూట్​

ఇదీ చదవండి: మార్చిలో స్వల్పంగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.