ETV Bharat / sukhibhava

తల్లిపాలలో టీకా ఆనవాళ్లు శూన్యం.. సూపర్ యాంటీబాడితో వైరస్ అంతం - super anti body can kill all kinds of corona viruses

కరోనా వ్యాక్సిన్​పై తాజా అధ్యయనాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. అన్ని రకాల కరోనా వైరస్​ల పనిపట్టే సూపర్ యాంటీ బాడీని అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టగా.. మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్​ఫ్రాన్సిస్కోల అధ్యయనంలో.. తల్లి పాలలో కరోనా టీకా ఆనవాళ్లు శూన్యమని తేలింది. అలాగే ఈ అధ్యయనాలు.. కరోనా(CoronaVirus) విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని.. వైరస్ బారిన పడకుండా కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించాయి.

సూపర్ యాంటీబాడితో వైరస్ అంతం
సూపర్ యాంటీబాడితో వైరస్ అంతం
author img

By

Published : Jul 20, 2021, 9:14 AM IST

సూపర్‌ యాంటీబాడీ!

కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 తరగతికి చెందిన అన్నిరకాల కరోనా వైరస్‌ల(CoronaVirus)కు ఒకే చికిత్స, ఒకే టీకా అందుబాటులోకి వస్తే? కరోనా పీడ పూర్తిగా విరగడవుతుంది కదా. అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. అన్నిరకాల కరోనా వైరస్‌ల పనిపట్టే యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పేరు ఎస్‌2హెచ్‌97. మొత్తం 12 యాంటీబాడీల మీద అధ్యయనం చేసి దీన్ని కనుగొన్నారు. ఇది అన్నిరకాల కరోనా వైరస్‌ ప్రొటీన్లకు అంటుకుపోయి, కణాల్లోకి విస్తరించకుండా చేస్తుండటం గమనార్హం. అందుకే దీన్ని సూపర్‌ యాంటీబాడీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇది మన కణ గ్రాహకాలకు వైరస్‌ అంటుకుపోయే భాగాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా వివిధ రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తోందని వివరిస్తున్నారు. కొన్ని సార్స్‌-కొవీ-2 రకాల వైరస్‌లు యాంటీబాడీల పట్టు నుంచీ తప్పించుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. చికిత్సలు, టీకాల విషయంలో ఇది పెద్ద సవాల్‌గా మారుతోంది. సూపర్‌ యాంటీబాడీ దీనికి పరిష్కార మార్గం చూపగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు.. మున్ముందు ఇంకా ఎలాంటి కొత్త కొత్త కరోనా వైరస్‌లు మనపై దాడి చేస్తాయోనని భయపడుతున్న తరుణంలో ఇది నిజంగా శుభవార్తే. అన్నిరకాల వైరస్‌లకు ఒకే టీకా, ఒకే చికిత్స రూపొందించటానికిది వీలు కల్పిస్తుందని ఆశిస్తున్నారు.

అలసత్వం వద్దు

కొవిడ్‌-19(CoronaVirus) విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. కేసులు తగ్గాయని అలసత్వం తగదు. రోజురోజుకీ కొత్త సార్స్‌-కొవీ-2 రకాలు పుట్టుకొస్తున్నాయనే విషయాన్ని మరవరాదు. వైరస్‌ తన మనుగడ కోసం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వస్తోంది. కొత్త జవసత్వాలతో విరుచుకు పడటానికి ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు డెల్టా రకం వైరస్‌నే చూడండి. దీన్ని బి.1.617.2 అనీ పిలుచుకుంటున్నారు. కణాల్లోకి తేలికగా చొచ్చుకొళ్లేలా ఇది ముల్లు ప్రొటీన్‌ను మార్చేసుకుంది. దీంతో త్వరగా ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తుంది. దీని బారినపడ్డవారి నుంచి ఇతరులకు వేగంగానూ వ్యాపిస్తోంది. అల్ఫా రకం వైరస్‌ కన్నా డెల్టా రకం వైరస్‌ 50% ఎక్కువ వేగంగా వ్యాపిస్తుండటం గమనార్హం.

డెల్టా బారినపడ్డ ఒకొకరు సగటున ముగ్గురు లేదా నలుగురికి వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది టీకాల ప్రభావాన్ని సైతం తప్పించుకొంటుండటం ఆందోళనకరం. డెల్టా నుంచి పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్‌ రకం వైరస్‌ అయితే ఊపిరితిత్తుల కణాల మీద ఇంకాస్త ఎక్కువగానూ దాడి చేస్తోంది. ఇదీ టీకాల ప్రభావాన్ని తప్పించుకుంటోంది. కాబట్టి కరోనా పూర్తిగా కనుమరుగయ్యేంతవరకు మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందే.

తల్లి పాలలో కరోనా టీకా ఆనవాళ్లు శూన్యం

బిడ్డకు పాలు పట్టే తల్లుల్లో కొందరు కరోనా టీకా తీసుకోవడానికి వెనకాడుతుంటారు. లేదూ టీకా తీసుకున్నాక బిడ్డకు పాలు పట్టడం మానేస్తుంటారు. దీనికి కారణం టీకాతో చనుబాలు మారిపోతాయేమోననే భయం. అలాంటి ఆందోళనలేవీ అవసరం లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్​ఫ్రాన్సిస్కో అధ్యయనం పేర్కొంటోంది. ఎంఆర్​ఎన్​ఏ టీకాల ఆనవాళ్లేవీ తల్లిపాలలో కనిపించలేదని వివరిస్తోంది. దీంతో ఎంఆర్​ఎన్​ఏ టీకాలు శిశువు శరీరంలోకి వెళ్లవనటానికి ప్రత్యక్ష రుజువు లభించినట్టయ్యింది. బిడ్డకు పాలు పట్టే తల్లులు నిరభ్యంతరంగా కరోనా టీకా తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తోంది. దీన్ని మన దగ్గరా అనుసరిస్తున్నారు. తాజా అధ్యయన ఫలితాలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.