గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలామందికి కంటిసమస్యలు(Eye problems) ఎక్కువవుతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ కల్చర్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెరగడం వల్ల చాలాసేపు కంప్యూటర్/ఫోన్ స్క్రీన్ చూస్తూ ఉండాల్సి వస్తుంది. దీంతో కళ్లు మసకబారడం, అక్షరాలు సరిగా కనిపించకపోవడం జరుగుతున్నాయి. కళ్లద్దాలు లేనిదే పేపర్ చదవలేకపోతున్నారు. ఫోన్ చూడలేకపోతున్నారు. మరి ఈ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా పడటం ఎలా? కంటిసమస్యను అదుపులో పెట్టేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
విటమిన్-సి ముఖ్యం
కంటిచూపును(Eye problems) మెరుగుపరుచుకునేందుకు విటమిన్-సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పుల్లని పళ్లతో పాటు క్యాప్సికమ్‌లో ఈ విటమిన్ ఉంటుంది. దీంతో పాటు ఒమేగా యాసిడ్స్ ఉన్న ఫుడ్కూడా తినాలి.
ఫ్యాటీ ఫిష్, సాల్మన్, ట్యూనా, ట్రౌట్, ఇతర సముద్ర చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆరెంజ్ కలర్లో ఉండే పండ్లు, స్వీట్ పొటాటో, క్యారెట్, మామిడి పండు, ఆప్రికాట్లలో అధిక మోతాదులో బీటా కెరోటిన్, విటమిన్ A ఉంటాయి. అలానే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు తింటుండాలి.
కంటిసమస్యలకు(Eye problems) ప్రధాన కారణం శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం. దీనిని అధిగమించేందుకు ఐరన్ ఉన్న పదార్థాలు విరివిరిగా తినాల్సి ఉంటుంది. అలానే చేపలు, కోడిగుడ్లు, డ్రైఫూట్స్, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు శరీరానికి అందిస్తూ ఉండాలి.
జింక్ ఉన్న ఆహార పదార్థాలు, తక్కువ కొవ్వు, అధికంగా పీచు ఉన్న ఆహార పదార్థాలు మన రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి. బాల్యం నుంచి ప్రతిరోజూ గుడ్డు తినాలి. దీనిలో ఉన్న జింక్, మన రెటీనా దెబ్బ తినకుండా కాపాడుతుంది.
చివరగా ఓ మాట.. మంచినీరు సరిగా తాగకపోయినా కంటి జబ్బులు(Eye problems) త్వరగా వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: