ETV Bharat / sukhibhava

ఎమోషన్​లో ఎక్కువ ఆకలేస్తే ఇలా చేయండి... - ways to control emotional and stress eating

మీరు ఎమోషన్​లో ఎక్కువ తినేస్తున్నారా? లాక్​డౌన్​ వేళ తెలియకుండానే బరువు పెరిగిపోతున్నారా? నోటిని అదుపు చేయడం మీ వల్ల కావట్లేదా? ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చేసుకుందామన్నా కుదరట్లేదా? అయితే ఈ కథనం కచ్చితంగా మీకోసమే...

Ms Divya Gupta, Consultant Nutritionist and Diabetes Educator on ways to control emotional and stress eating during lockdown
ఎమోషన్​లో ఎక్కువ ఆకలేస్తే ఇలా చేయండి!
author img

By

Published : May 19, 2020, 12:30 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం, అడ్డూ అదుపు లేకుండా తీసుకుంటే విషం అంటారు. ఆకలేసినప్పుడు ఎవరైనా తింటారు. కానీ, కొందరు ఎలాంటి భావోద్వేగాలొచ్చినా ఆహారంతోనే దిగమింగుతారు. కాస్త బోర్​ కొట్టినట్టు అనిపించినా నోరాడిస్తూ టైంపాస్​ చేస్తారు. అవును, భావోద్వేగానికి లోనైనప్పుడు.. రక్తంలో విడుదలయ్యే కోర్టిసాల్​ హార్మోన్​ వల్ల ఆకలి పెరుగుతుంది. పైగా స్వీట్ల వంటి రుచికరమైన ఆహారం తినాలని కోరిక పుడుతుంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్​ డా. దివ్యా గుప్తా.

మనం ఏం తింటామో అది సరాసరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు డాక్టర్​ దివ్వా గుప్తా. లాక్​డౌన్​ వేళ.. సమయం, సందర్భం లేకుండా కలిగే 'భావోద్యేగ ఆకలి'ని జయించే చిట్కాలు ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

ధ్యానాస్త్రం..

లాక్​డౌన్​ వేళ భావోద్వేగ ఆకలి వేస్తే.. దానిని జయించే అస్త్రంగా ఉపయోగపడుతుంది ధ్యానం. వీలైనంత ఎక్కువ గాలిని పీల్చి.. మెల్లగా వదలడం వల్ల మీపై మీకు నియంత్రణ వస్తుంది. శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల కాసేపటి వరకు ఆకలిని మర్చిపోతారు. అందుకే యోగాలో నయా ట్రెండ్​ను ట్రై చేయండి!

ఆకలి మీ ఫీలింగేనా?

సాధారణంగా రోజుకు మూడు పూటలు తింటే శరీరానికి సరిపోతుంది. కానీ, మధ్యలో బోర్​కొట్టినప్పుడు నోటికి ఆకలేస్తుంది. అందుకే, ఆకలి శరీరానికా, మీ భావోద్వేగానికా అనేది తేల్చుకుంటే సగం సమస్య పరిష్కారమవుతుంది. మూడు పూటలు తిన్నాక కూడా ఆకలిగా ఉంటే, మీరు మెచ్చే రుచులతోనే ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకోవాలి. దీంతో మితంగా తినడం అలవాటు అవుతుంది.

చిన్న కంచంలో.. కొంచెం చాలు!

మనం తినే కంచాలు కూడా మన ఆహార అలవాట్లపై ప్రభావం చూపుతాయి. తినే ప్లేటు చిన్నదిగా ఉంటే తక్కువ తిని, ఆరోగ్యంగా ఉంటారని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే, చిన్న కంచంలో కొంచెం ఆహారాన్నే నిదానంగా తినండి. ఎక్కువ సేపు తినడం వల్ల కడుపు నిండినట్టు అనిపిస్తుంది.

తృప్తిగా తినండి...

మిమ్మల్ని తృప్తి పరిచే ఆహారాన్ని తీసుకుంటే కొద్దిగా తిన్నా సరిపోతుంది. కోడి గుడ్లు, పన్నీర్, కినోవా వంటి ప్రోటీన్​ కలిగిన వాటిని తింటే రుచిగానూ, ఆరోగ్యకరంగానూ ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులున్న గింజలు, చేపలు​, రైస్ బ్రాన్ నూనె, పొద్దు తిరుగుడు పువ్వు నూనె లాంటివి తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. ఎక్కువగా కూరగాయలు, పండ్లను కడుపు నిండా తినండి.

మంచినీరు మరవొద్దు

పైన చెప్పినవాటన్నింటితో పాటు మంచినీటికి మించిన హెల్దీ డ్రింక్​ లేదు. కాబట్టి నీరు బాగా తాగి.. శరీరం డీహైడ్రేట్​ అవ్వకుండా చూసుకోవాలి. రోజుకు కనీసం 8,9 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. నీటిలో ఏవైనా పండ్లు, కీరా, నిమ్మకాయలను వేసుకుని తాగితే మరీ మంచిది.

ఇదీ చదవండి:'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.