మానవునిలో రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తోడ్పడే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇలా పనిచేస్తుంది..
సెప్సీవ్యాక్ పేరుతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్స్‌ను కొవిడ్ సోకిన వారికి దగ్గరగా ఉన్న వ్యక్తులు(క్లోజ్ కాంటాక్ట్స్), వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇవ్వడం వల్ల వారిలో సహజసిద్ధంగా రోగ నిరోధకశక్తి పెరిగి వైరస్ సోకకుండా నిరోధించగలుగుతుందని పేర్కొంది. వైరస్ తీవ్రత అధికం కాకుండా ఇది నిరోధిస్తుందని, అందువల్ల తీవ్ర అనారోగ్యం పాలై ఐసీయూ అవసరమైన కరోనా రోగులు కూడా త్వరగా కోలుకోవడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపింది. రోగులపై ఇది ఎలాంటి దుష్పరిణామాలు చూపదని వివరించింది. 'న్యూ మిల్లెనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం' కింద అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసినట్లు శాస్త్ర, సాంకేతిక శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: వైరస్‌లతో నష్టాలే కాదు... లాభాలూ ఉన్నాయ్!