ETV Bharat / sukhibhava

'కరోనాసుర' హస్తాన్ని నియంత్రణలో ఉంచుదాం ఇలా... - corona issues on controlling

ప్రస్తుత కరోనా కాలంలో చేతులు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. చేతులు ఎక్కడ పెడుతున్నాం అనే అంశమై దృష్టి ఉంచాలని పేర్కొంటున్నాయి. కరోనా అంటిన ప్రదేశాలు, వస్తువులపై చేతులుంచి ముఖాన్ని తాకినా వైరస్ సంక్రమించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హస్తాలను పదిలంగా కాపాడుకోవాలని అంటున్నాయి. చేతుల పోకడలను నియంత్రించి కరోనా ముప్పు బయటపడేందుకు పలు సూచనలు చేస్తున్నాయి.

corona controlling
కరోనాసుర హస్తం.. నియంత్రణలో ఉంచుదాం!
author img

By

Published : Apr 21, 2020, 4:06 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

మన చేతులే మన శత్రువులైతే? కరోనా వైరస్‌ భయంతో ఇప్పుడిలాంటి పరిస్థితే నెలకొంది. కరోనా జబ్బు గలవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లను పీల్చటం ద్వారా వైరస్‌ ఇతరులకు సోకుతుంది. అంతేకాదు, వైరస్‌ చుట్టుపక్కల వస్తువుల మీద అంటుకుంటే దాన్ని ముట్టుకున్న చేతులతో ముఖాన్ని తాకినా సంక్రమిస్తుంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటమే కాదు, వీలైనంతవరకు ముఖానికి చేతులు తాకకుండా చూసుకోవటమూ ముఖ్యమే. ఇది చెప్పినంత సులభం కాదు ఆచరించటం. మనకు తెలియకుండానే ముక్కును, నోటిని తాకుతూనే ఉంటాం. గంటకు కనీసం 23 సార్లయినా ముఖాన్ని తాకుతుంటామని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి దీన్ని అదుపులో ఉంచుకోవటమెలా?

  • ఎప్పుడెప్పుడు, ఎలా చేతులను తాకుతుంటామో అనేది గ్రహించటం ప్రధానం. ఇతరులను గమనించటం ద్వారా దీన్ని తెలుసుకోవచ్ఛు కొందరు బోర్‌ కొట్టినప్పుడు చుబుకాన్ని చేతులకు ఆనిస్తుండొచ్ఛు ఏదైనా విచారంతో నుదురు రుద్దుకోవచ్ఛు విసుగుపుట్టి గోర్లు కొరుకుతుండొచ్ఛు ఇలాంటి సందర్భాల్లో మనమూ అలాగే చేస్తుండొచ్ఛు దీన్ని గుర్తిస్తే ఒకింత పరిష్కారం లభించినట్టే.
  • చేతులకు సువాసనతో కూడిన సబ్బు, లోషన్‌ లేదా పరిమళ ద్రవ్యాన్ని రాసుకోవచ్ఛు దీంతో చేయి ముఖం దగ్గరికి రాగానే వాసన తగులుతుంది. అప్పుడు వెంటనే చేతులను దూరంగా జరపొచ్చు.
  • బయటకు వెళ్లినప్పుడు ముఖానికి గుడ్డ మాస్కు ధరిస్తే ముక్కు, నోటిని అంతగా తాకకుండా చూసుకోవచ్చు.
  • చేయటానికి ఏ పనీ లేకపోతే స్ట్రెస్‌ బంతి, ఫిట్జెట్‌ స్పిన్నర్‌, రబ్బరు బ్యాండు వంటివి చేతిలోకి తీసుకుంటే సరి. ఆ పనుల్లో పడిపోయి ముఖానికి చేయి తగలకుండా జాగ్రత్త పడొచ్చు.
  • డెస్క్‌ లేదా బల్ల ముందు కూర్చుంటే చేతులను వాటి మీద ఆనించొద్ధు ఒడిలోనో, తొడల కిందో చేతులను పెడితే వెంటనే ముఖం దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు.
  • టిష్యూ కాగితం లేదా రుమాలు అందుబాటులో ఉంచుకోవటం మంచిది. ముక్కు మీద దురద పెట్టినా.. కళ్లు, ముక్కు, నోరు తుడుచుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుంది.
  • ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ప్రయత్నించినా ముఖానికి ఏమాత్రం చేతులు తాకకుండా చూసుకోవటం కష్టం. కానీ ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులను కడుక్కుంటుంటే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అందువల్ల చేతులు కడుక్కోవటం, దూరం పాటించటం ప్రధానమనే సంగతిని గుర్తుంచుకొని ఆచరించాలి.

ఇదీ చూడండి: ఏడాది చివరిలోగా చైనా వైద్యులకు కరోనా వ్యాక్సిన్!

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.