ETV Bharat / sukhibhava

వ్యక్తిగత పరిశుభ్రతతో 50% రోగాలకు చెక్​!

చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి పరిశుభ్రతలను రోజూ పాటించడం ద్వారా 50 శాతం అంటు రోగాలు దరి చేరకుండా కాపాడుకోవచ్చని ప్రముఖ జర్నల్ ఏజేఐసీ​ ఓ వ్యాసం ప్రచురించింది. ఈ ఆరోగ్య జాగ్రత్తలతో యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం 30 శాతం తగ్గుతుందని పేర్కొంది. కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో కీలకమని స్పష్టం చేసింది.

Everyday hygiene reduces need for antibiotics by 30 pc, says new pape
వ్యక్తిగత పరిశుభ్రతతో 50 శాతం రోగాలకు చెక్​!
author img

By

Published : May 9, 2020, 3:58 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

వ్యక్తిగత పరిశుభ్రతతో 50 శాతం అంటువ్యాధులను నివారించవచ్చని అమెరికన్ జర్నల్​ ఆఫ్ ఇన్​ఫెక్షన్​ కంట్రోల్​(ఏజేఐసీ) వ్యాసం ప్రచురించింది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి కనీస ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే యాంటీబయాటిక్స్​ అవసరం 30 శాతం వరకూ తగ్గుతుందని స్పష్టం చేసింది. వ్యూహాత్మక ప్రణాళికల్లో పరిశుభ్రత భాగమైతే ఏటా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్​) కారణంగా​ సంభవించే వేలాది మరణాలను తగ్గించవచ్చని వెల్లడించింది. వీరంతా సూక్షజీవుల కారణంగా వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యక్తిగత పరిశుభ్రతే చాలా కీలకమైందని ఏజేఐసీ స్పష్టం చేసింది. రోజువారి దినచర్యలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి భాగమయ్యాయని పేర్కొంది. అయితే జాతీయ, అంతర్జాతీయ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వ్యూహాలు మాత్రం సామాజిక పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యాయని వివరించింది. ఈ వ్యాసాన్ని ప్రపంచ పరిశుభ్రత మండలి(జీహెచ్​సీ) తరఫున ఆన్​లైన్​లో ప్రచురించింది ఏజేఐసీ.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని నిలువరించేదుకు ఇళ్లలో పరిశుభ్రత పాటించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో ఈ వ్యాసం తెలియజేస్తోందని కార్డిఫ్​ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్​ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ తెలిపారు. విధానకర్తలు ఈ విషయాన్ని అత్యవసరంగా గుర్తించాలని సూచించారు.

పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని గుర్తించి ఆరోగ్య నిపుణులు, సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ విధానకర్తలతో మేనిఫెస్టో రూపొందించే కార్యక్రమం ప్రారంభించిన సమయంలోనే ఈ వ్యాసం ప్రచురితమవడం గమనార్హం.

మేనిఫెస్టో ప్రధానాంశాలు..

  • జాతీయ ఏఎంఆర్​ వ్యూహాలను అమలు చేేసే ఐపీసీ కమిటీలు చేతుల శుభ్రత, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటు రోగాలు నియంత్రించవచ్చని, యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గించవచ్చని గుర్తించాలి. గ్లోబల్ ఏఎంఆర్​ ప్రణాళికల్లో 2022 నాటికి, జాతీయ ప్రణాళికల్లో 2025 నాటికి పొందుపర్చాలి.
  • సమాజంలో ప్రతి ఒక్కరికీ వీటిపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి.
  • సంబంధిత వైద్య సిబ్బందితో కార్యాచరణ రూపొందించి ఏఎంఆర్​ గురించి సమాజంలో అందరికీ తెలిసేలా చేయాలి.

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.