ETV Bharat / sukhibhava

కరోనాతో ఆందోళన వద్దు.. వాటిని అతిగా కొనొద్దు - corona live updates

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న 'కొవిడ్'​ బారి నుంచి రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది అతి జాగ్రత్తకు పోయి అవసరానికి మించి కొంటున్నారు. వీటినే కాదు నిత్యవసరాలు, ఔషధాలు ఇలా అన్నీ అధిక మోతాదులో కొనేసి ఇంట్లో పడేస్తున్నారు. మరి ఇలా చేయడం ఎంత వరకు శ్రేయస్కరం. లాక్​డౌన్​ సమయంలో ఇంకా ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం.

Do not overuse the sanitizers, masks and essentials with concern over corona
కరోనాతో ఆందోళన వద్దు.. వాటిని అతిగా కొనొద్దు
author img

By

Published : Apr 20, 2020, 6:13 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఇది మంచి పరిణామమే.. కానీ, కరోనా వ్యాప్తిపై సరైన అవగాహన లేక సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు చూసి కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ మాస్కులకు బదులు ఎన్‌-95‌ మాస్కులు వాడుతున్నారు.. సొంతంగా వైద్యం, శానిటైజర్లను తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. అతిగా ఖర్చు చేస్తున్నారు. కరోనా భయంతో ఇలాంటి వాటిపై అనవసరంగా డబ్బులు వృధా చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్‌-95 మాస్కులు సాధారణ వ్యక్తులకు కాదు

Do not overuse the sanitizers, masks and essentials with concern over corona
ఎన్​-95 మాస్కులు

కరోనా సోకకుండా మాస్కులు వాడమని ప్రభుత్వం సూచిస్తున్న వేళ.. సాధారణ ప్రజలు ఎన్-95, సర్జికల్‌ మాస్కులు కొనుక్కొని వాడుతున్నారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఆ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ఈ మాస్కులు ఎంతో అవసరం. ప్రస్తుతం వీటి ఉత్పత్తి.. సరఫరా చాలా తక్కువగా ఉంది. అందుకే వీటిని వైద్య సిబ్బందికే ఇవ్వడం మంచిది. మనం సాధారణ మాస్కులు, ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులు, అవీ సాధ్యం కాకపోతే చేతి రుమాలను వాడితే సరిపోతుంది.

గ్లౌజులు ఎల్లవేళలా అవసరమా...

గ్లౌజులు

కరోనా దెబ్బకు మనమంతా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండిపోయాం. రోజూ చేసిన పనులే చేస్తుంటాం. మరి ఇంట్లో గ్లౌజులు వాడటం ఎందుకు? ఒకవేళ బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే సమయంలో గ్లౌజులు వాడొచ్చు. అయితే వాటిని రీయూజ్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. చేతులకు ఎలా వైరస్‌ అంటుకుంటుందో.. గ్లౌజులకు అలాగే అంటుకుంటుంది. కాబట్టి సర్జికల్‌ గ్లౌజులు వాడకుండా, సింగిల్ యూజ్‌ గ్లౌజ్‌లు వాడటం, ఏదైనా పని చేసినప్పుడు వెంటనే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం మంచిది. వైద్య సిబ్బందికి ఆ గ్లౌజులు తప్పనిసరి. వాటిని వారికే ఉండనిద్దాం.

అవసరానికి మించి కొనొద్దు..

నిత్యవసరాలు

కరోనా సంక్షోభం.. హోం క్వారంటైన్‌ కారణంగా దుకాణాల్లో సరకులు నిండుకుంటాయని, ధరలు పెరుగుతాయని చాలా మంది భ్రమపడి అవసరానికి మించి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఏ సూపర్‌ మార్కెట్‌కి వెళ్లినా ఖాళీ అరలు కనిపిస్తున్నాయి. నిజానికి నిత్యావసరాల ఉత్పత్తి.. సరఫరా ఎక్కడా నిలిచిపోలేదు. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టు వస్తువులు కొనుగోలు చేయండి. అవసరం లేకపోయినా.. పడుంటాయిలే అని తెగ కొనేయకుండా... అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి.

శానిటైజర్‌ కొనేముందు జాగ్రత్త

శానిటైజర్​

ప్రస్తుతం శానిటైజర్లకు చాలా డిమాండ్‌ ఉంది. ఫలితంగా కొన్ని నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కనీసం 60 శాతం ఇథనాల్‌ లేదా 70 శాతం ఐసోప్రొపైల్‌ లేని శానిటైజర్లు వైరస్‌ను చంపలేవని సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) చెబుతోంది. అందుకే శానిటైజర్‌ కొనే ముందు ఆల్కాహాల్‌ శాతాన్ని చెక్‌ చేయండి. నకిలీ శానిటైజర్లు కొని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి.

విటమిన్ ట్యాబ్లెట్‌లపై ఆధారపడకండి

విటమిన్​ ట్యాబ్​లెట్లు

కరోనాను ఎదుర్కొనేందుకు కొంతమంది విటమిన్స్‌ ఉన్న మందులను వేసుకుంటున్నారు. వీటితో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్న వారికి ఈ విటమిన్స్‌ ఎలాంటి అదనపు లాభాన్ని చేకూర్చవు. ఇవి కేవలం పౌష్టికాహారం లోపం ఉన్నవారికే ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనవసరంగా విటమిన్‌ టాబ్లెట్లు మందులు వేసుకోవద్దు. వాటికి బదులు రోగనిరోధక శక్తి పెంచే పండ్లు కొని తినండి. అలాగే కొందరు యాంటీ బయోటిక్స్‌ మందులు వాడుతున్నారు. ఇవి కేవలం బ్యాక్టీరియాలను మాత్రమే చంపుతాయి.. వైరస్‌ని కాదని గుర్తుంచుకోండి.

శుభ్రత కోసం అధిక ఖర్చులొద్దు

ఇంటిని శుభ్రం చేసే పరికరాలు

వైరస్​ నుంచి కాపాడుకునే క్రమంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇందుకోసం ప్రత్యేక క్లీనర్స్‌ను కొనాల్సిన పనిలేదు. నిత్యం మనం ఉపయోగించే వస్తువులను సాధారణ క్లీనర్లతోనే శుభ్రపర్చుకోవచ్చు. ముఖ్యంగా తలుపులకు, డ్రాలకు ఉండే హ్యాండిల్స్‌, బ్యాగ్స్‌, వేసుకునే బట్టలు తదితర వస్తువులను ప్రతి రోజు శుభ్రం చేయాలి.

జుట్టు, ముఖంపై సొంత ప్రయోగాలు వద్దు

Do not overuse the sanitizers, masks and essentials with concern over corona
కరోనాతో ఆందోళన వద్దు.. వాటిని అతిగా కొనొద్దు

లాక్‌డౌన్‌తో సెలూన్‌ షాపులు, బ్యూటీ పార్లర్లు మూతపడ్డాయి. తద్వారా హోం క్వారంటైన్‌లో ఉంటున్న చాలా మందికి జుట్టు పెరిగిపోయి, ముఖంలో మెరుపు తగ్గిపోయి ఉండొచ్చు. అంతే కొంత మంది దుకాణాల్లో దొరికే సాధారణ నూనె, ఫేస్‌ క్రీమ్‌లతో ఇంట్లోనే జుట్టు, ముఖంపై ప్రయోగాలు చేస్తున్నారట. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు వేచి ఉండండి.

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.