ETV Bharat / state

చేనేతకు సాంకేతికత జోడించిన యువకుడు - ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు - ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు పొందిన యుగేందర్

yugender Of Pochampalli : ఉన్నతమైన చదువు, లక్షల్లో జీతం అవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. పుట్టిన ఊరిలోనే ఉంటూ కుల వృత్తి చేసుకుంటే తప్పేంటని భావించాడు. ఆలోచనకు అనుగుణంగా ఆచరణలోకి దిగాడు. కులవృత్తికి కాస్తంత సాంకేతికతను జోడించాడు. ఈ వృత్తిలో రాణించలేం అనే స్థితి నుంచి 150 మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఆసియా సంస్థతో పాటు వివిధ సంస్థల నుంచి ఉత్తమ వ్యాపార వేత్తగా ఆవార్డులు పొంది పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యువ వ్యాపార వేత్త యుగేందర్‌పై ప్రత్యేక కథనం.

Asia Award winner yugender Story
yugender Of Pochampalli
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 6:11 PM IST

చేనేతకు సాంకేతికత జోడించిన యువకుడు - ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు

yugender Of Pochampalli : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ప్రపంచ ప‌ర్యాట‌క కేంద్రంగానూ భూదాన్ పోచంప‌ల్లి ఖ్యాతి గడించింది. చీరలకు ప్రసిద్ధి గాంచిన భూదాన్‌ పోచంపల్లిలో పట్టు చీర తయారీ, చీరల అమ్మకాలు సైతం అన్ని ఇక్కడే జరగుతాయి. ఇప్పుడు ఇక్కత్ చీరలు మంచి గుర్తింపును పొందాయి. మగువలు మెచ్చే అందమైన ఇక్కత్ చీరలు ఇక్కడే పుట్టాయి.

Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు

Asia Award winner yugender Story : యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన గంజి యుగేందర్ బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఏడాది పని చేశారు. లక్షల్లో జీతం వస్తున్నా అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. పుట్టిన ఊరిలోనే ఉంటూ కుల వృత్తి చేసుకుంటే తప్పేంటని భావించాడు. తాతయ్య, నాన్న చేసిన కులవృత్తిపై దృష్టిసారించాడు. చేనేత మగ్గాలపై నేసే చీరలు మార్కెటింగ్‌ లేక నష్టాల్లో ఉన్న వారిని చూసి కాస్తంత సాంకేతికతను జోడించాడు. ఇక్కత్ వరల్డ్ పేరుతో స్టోర్‌ను ప్రారంభించారు. ఆన్‌లైన్‌, ఈ మార్కెటింగ్‌ ద్వారా అమ్మకాలు చేస్తే ఎలా ఉంటుందని ప్రయత్నించాడు. మెదట్లో అనుకున్నంత రెస్పాన్స్‌ రాకపోయినా ఎప్పటికప్పడు కొత్తగా ఆలోచిస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు యుగేందర్.

yugenderAsia Best Businessman Award : పోచంపల్లి ఇక్కత్‌ చీరలను దుకాణంలోనే కాకుండా ఈ మార్కెటింగ్​లోనూ ప్రమోట్‌ చేస్తూ ఆన్‌లైన్‌తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా య్యూటూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఈ వృత్తిలో రాణించలేం అనే స్థితి నుంచి 150 మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాడు. కస్టమర్స్‌కు నచ్చిన విధంగా వారిగా కావాల్సిన డిజైన్లు, మోడల‌్స్‌, వివిధ రంగుల్లో ఎప్పటికప్పుడు కొత్తవి అందిస్తూ వ్యాపార రంగంలో రాణిస్తున్నామని యుగేందర్‌ చెబుతున్నారు.

అమ్మో.. ఈ చీర ధర రూ.21 లక్షలు.. అంత స్పెషలేంటో?

"2014లో నేను బీటెక్ పూర్తి చేశాను. సంవత్సరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. ఊరిలోనే సొంత వ్యాపారం చేయాలనుకున్నాను. ఇక్కత్ వరల్డ్ పేరుతో స్టోర్‌ను ప్రారంభించాను. చేనేత మగ్గాలపై నేసే చీరలను ఆన్‌లైన్‌, ఈ మార్కెటింగ్‌ ద్వారా అమ్మకాలు చేశాను. కస్టమర్స్‌కి నచ్చిన విధంగా వారికి కావాల్సిన డిజైన్లు, మోడల‌్స్‌, వివిధ రంగుల్లో ఎప్పటికప్పుడు కొత్తవి అందిస్తున్నాను. కొవిడ్ సమయంలో కొన్ని నష్టాలు వచ్చినా, తర్వాత అమ్మకాలు పెరిగాయి.'' -గంజి యుగేందర్, ఇక్కత్‌ వరల్డ్‌ స్టోర్‌ అధినేత

ఇటీవల అసియా సంస్థ నిర్వహించిన బిజినెస్ అవార్డుల పోటీల్లో శ్రీలంక, భూటాన్, మలేషియా, కెన్యా, నేపాల్, మారిషస్, మాల్దీవులు ఇలా 11 దేశాల నుంచి వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ విక్రయాలు, ఇక్కత్ వస్త్రాలకు ఉత్తమ మార్కెటింగ్‌ కల్పించినందుకు ఈ ఏడాది ఆసియా సంస్థ నుంచి బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు లభించిందని అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని గంజి యుగేంధర్ తెలిపారు.

"చేనేత మరమగ్గాల సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీ కాలం అయిదేళ్లే. గడువు ముగిసినా నూతన పాలకవర్గం ఏర్పడలేదు. నూతన పాలకవర్గం ఏర్పాటు చేసి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి" - యుగేందర్

"పోచంపల్లి చీరలు ప్రత్యేకం. అందుకే ఏడాదిలో రెండుసార్లు వచ్చి కావాల్సిన దుస్తులు తీసుకుని వెళ్తుంటాము. వీటితో పాటు ఇక్కడ వివిధ మోడల్స్‌ దొరుకుతాయి. ధరలో వ్యత్యాసం, క్వాలీటీ బాగుంటుంది. " - వినియోగదారుడు

గత ఏడేళ్ల నుంచి ఇక్కత్‌ వరల్డ్‌లోనే పని చేస్తున్నామని, కాలానుగుణంగా వివిధ రకాల ఇక్కత్‌ చీరలు అందుబాటులోకి తీసుకువచ్చి పోటీ మార్కెట్‌లో ఉన్నామని, దాని వల్లే తన లాంటి 150 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నామని కార్మికుడు చెబుతున్నారు. ఎక్కడో జీతం కోసం పని చేయడం కంటే మనకు ఉన్నదానిలో చిన్న వ్యాపారం పెట్టుకుంటే మనతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని యుగేందర్‌ అంటున్నారు.

Banarasi Saree New Collection : మార్కెట్​లో నయా​ 'బనారసీ' చీరలు​.. డిజైన్లు అదుర్స్.. మహిళలు ఫిదా!

ఔరా! అనిపిస్తున్న చేనేత వెండి చీర.. ధర ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.