YS Sharmila: నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భువనగిరి పట్టణంలో ఆమె మాట్లాడారు. తన పాదయాత్రకు కేసీఆర్, కేటీఆర్ ఒకరోజు రావాలని... ప్రజలు సమస్యలు లేవంటే తాను ఇక్కడి నుంచే వెళ్లిపోతానని షర్మిల సవాల్ విసిరారు. లేని పక్షంలో కేసీఆర్ రాజీనామా చేసి దళితుడుని ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రాజశేఖర్ రెడ్డి 33 సార్లు వచ్చారని గుర్తు చేశారు. జిల్లాకు కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చారని ప్రశ్నించారు. బీబీ నగర్ నిమ్స్ ఎయిమ్స్‌గా మారిందంటే దానికి కారణం వైఎస్ఆర్ అని వైఎస్ షర్మిల తెలిపారు.
"రాష్ట్రంలో 54 లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. చదువుకున్నా నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. రుణ మాఫీ, ఉచిత విద్య, మూడెకరాల భూమి ఏమయ్యాయి. బంగారు తెలంగాణగా మారుస్తానని బార్ల తెలంగాణగా మార్చారు. రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పులో ఉంది." - వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
కేవలం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రాజశేఖర్ రెడ్డి భూపంపిణీ, ఆరోగ్య శ్రీ, ఫింఛన్లు లాంటి వినూత్న పథకాలు ప్రజల కోసం తీసుకువచ్చారన్నారు. అలాంటి సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే వైతెపాను ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ షర్మిల కోరారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ మనుగడ కోసం అవసరమైన చోట మార్పులు చేయాలి: మర్రి శశిధర్ రెడ్డి