యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన వినోద్ అనే యువకుడు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని అతని చారవాణి వాట్సాప్ స్టేటస్ బట్టి తెలుస్తోంది. మృతుడు భువనగిరి పట్టణంలో ఓ షాపులో పని చేస్తున్నాడు. ఆ షాప్ సమీపంలోనే యువతి కుటుంబం నివసిస్తోంది. వారిద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటం వల్లే వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇవీచూడండి: ఇది ప్రజాధన దుర్వినియోగమే: అఖిలపక్షం