యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలో ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నట్లు ఈవో గీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు జరిపించే శ్రీస్వామి వారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలు సోమవారం నుంచి మొదలవుతాయని, మంగళవారం నుంచి సుదర్శన నారసింహ హోమం ప్రారంభిస్తామన్నారు. దీంతో పూజల వేళల్లో మార్పులు చేశామని.. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 9.45కు నివేదన(ఆరగింపు), స్వామి వారికి శయనోత్సవం అనంతరం ద్వార బంధనము చేపట్టనున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం ప్రసాద విక్రయశాలలో మహాప్రసాదం కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : సండే ఎఫెక్ట్.. భక్త జనసంద్రంగా మారిన ప్రాణహిత నదీ తీరం