పునర్నిర్మితమైన ఆలయాలతో యాదాద్రి పుణ్యక్షేత్రం శోభిళ్లనుంది. పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విలసిల్లుతున్న ఆలయాన్ని కృష్ణశిలతో రూపొందించిన విషయం తెలిసిందే. మండప ప్రాకారాలలోని స్థూపాలపై పలు రకాల రూపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ నారసింహ రూపాలు, హిరణ్య కశ్యపుడి సంహరం, దేవతా మూర్తులు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భక్త ఆంజనేయుడు మొదలైన అవతారాలు మండప ప్రాకారాల్లో తీర్చిదిద్దారు.



ఇవే కాకుండా సింహం, రామచిలుక, చేపలు, సర్పం లాంటి పలు ప్రాణులను సాక్షాత్కరింప జేయడం విశేషం. కొండ కింద గిరి ప్రదర్శన దారిలో ఆహ్లాదాన్ని పంచే విధంగా... పచ్చదనం విరబూసేలా రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు.



