Record Income in Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తిక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో ఇవాళ ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదు. యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు కార్తిక మాసం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇవాళ రూ.కోటికి పైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.
వివిధ సేవలు, కౌంటరు విభాగాల ద్వారా ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000, వీఐపీ దర్శనం టికెట్లకు రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ.13,44,000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000 సహా వివిధ సేవల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.
ఇవీ చదవండి: 15న కేసీఆర్ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం.. ఆ అంశాలపై చర్చ..!
ఉద్యోగం చేస్తూ దూడతో కలిసి 360 కి.మీ నడక.. దేవుడి మొక్కు తీర్చేందుకని..