యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో విధులు నిర్వహిస్తోన్న స్థపతి అడ్వైజరీ ఆనందచారికి గ్లోబల్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో అవార్డు గ్రహీత ఆనందచారికి తహసీల్దార్ వై.అశోక్ రెడ్డి అందజేసి... సన్మానం చేశారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవడం ఎంతో గొప్పగా భావిస్తున్నానని ఆలయ స్థపతి ఆనందచారి వేలు అన్నారు. ఒక శిల్ప కళాకారుడిగా 40 ఏళ్ల సేవలకుగాను... లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ గ్లోబల్ టీచింగ్ అవార్డు రావటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పులు, సహాయ స్థపతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బడ్జెట్ బెత్తెడు... భారం బండెడు