ETV Bharat / state

యాదాద్రి పర్యటనలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యటన తరువాత కొండపైన హరిత టూరిజంలో పలు శాఖల అధికారులతో సమావేశం జరిపారు.

Yadadri Sri laxmi Narasimha Swamy temple was visited by CMO Chief Secretary Bhopal Reddy
యాదాద్రి పర్యటనలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి
author img

By

Published : Feb 24, 2021, 8:21 PM IST

యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేలోగా పెండింగ్, ప్రధాన ఆలయం పనులు పూర్తి చేయాలని సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆదేశించారు. కొండపైన విష్ణు పుష్కరిణి, కొండ కింద వైకుంఠ ద్వారం, రింగ్ రోడ్డు, మెట్ల నిర్మాణాలు పరిశీలించారు.

మొదటగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. కొండ పైన ప్రధాన ఆలయ మాడవీధులు, ప్రసాద కాంప్లెక్స్, రథశాల, లిప్టు పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గండి చెరువు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పుష్కరిణి, దీక్ష పరుల మండపం, అన్నదాన (సత్రం) భవనం, కల్యాణ కట్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నేటి పర్యటనలో పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత కొండపైన హరిత టూరిజంలో పలు శాఖల అధికారులతో సమావేశం జరిపారు. ఆయన వెంట ఈఎన్సీ రవీందర్ రావు, గణపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఈఓ గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఆర్అండ్​బీ అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: 'విజయం కోసం భాజపా వ్యూహాం.. పార్టీనేతలకు బండి మార్గనిర్దేశం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.