ETV Bharat / state

Yadadri: యాదాద్రీశుడి చెంతకు గోదావరి జలాలు.. - Yadadri bhuvanagiri district news

విశ్వ ఖ్యాతి చెందేలా... భక్తుల మనస్సును ఆకర్షించేలా కృష్ణశిలతో పునర్నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధి పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో భక్తులు గోదావరి జలాలతో పుణ్యస్నానం ఆచరించేలా పనులు వేగవంతమయ్యాయి. మహాకుంభ సంప్రోక్షణలోపు పనులు పూర్తయ్యేలా యాడా చర్యలు చేపట్టింది.

Yadadri
Yadadri
author img

By

Published : Oct 26, 2021, 12:21 PM IST

యావత్‌ దేశాన్ని ఆకర్షించేలా కృష్ణశిలతో పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మహాకుంభ సంప్రోక్షణ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో భక్తులు గోదావరి జలాలతో పుణ్యస్నానం ఆచరించేలా పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలంపుతో యాడా ఈ చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జగదేవ్‌పూర్‌ నుంచి బస్వాపూర్‌ జలాశయానికి వచ్చే కాల్వపై 40 కిలోమీటర్ల వద్ద సైదాపూర్‌ కాల్వ నిర్మించారు.

సైదాపూర్‌ కాల్వ ద్వారా యాదాద్రికి గోదావరి జలాలు

ఈ కాల్వపై 8.5 కిలోమీటర్ల వద్ద ఎలాంటి వరద నీరు కలవకుండా రూ.2 కోట్లతో రెండు కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా పైపులైన్‌ వేస్తున్నారు. దీని ద్వారా యాదాద్రి దిగువన ఉన్న గండి చెరువును గోదావరి జలాలతో నింపుతారు. అక్కడి నుంచి చెంతనే ఉన్న లక్ష్మీ పుష్కరిణి, కొండపైనున్న విష్ణు పుష్కరిణిలకు పంపుతారు. ఇలా నిరంతరం శుద్ధమైన గోదావరి జలాలతోనే భక్తులు పుణ్యస్నానాలు చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలోపు పనులు పూర్తయ్యేలా యాడా పనులను వేగవంతం చేసింది.

నూతన వైకుంఠం ద్వారం...
నూతన వైకుంఠం ద్వారం...

మెట్ల రేలింగ్‌కు స్వల్పంగా పగుళ్లు...

అభివృద్ధి పనుల్లో భాగంగా కొండకింద పాత వైకుంఠ ద్వారం తొలగించి నూతన వైకుంఠం ద్వారాన్ని నిర్మిస్తున్నారు. వైకుంఠ ద్వారం చేరుకునేందుకు ఇటీవల చేపట్టిన మెట్ల రేలింగ్‌కు అక్కడక్కడా స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి. నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినా అప్పుడే పగుళ్లు రావడంతో స్థానికులు విమర్శించారు. పగుళ్లు లేకుండా నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఐతే సిమెంట్‌తో చేసిన నిర్మాణం కాబట్టి అక్కడక్కడ స్వల్పంగా పగుళ్లు తేలడం సాధారణమేనని... మరమ్మతులు చేయిస్తామని అధికారులు తెలిపారు.

వైకుంఠ ద్వారం చేరుకునేందుకు నిర్మించిన మెట్ల రేలింగ్‌కు స్వల్ప పగుళ్లు..

ఇదీ చదవండి: YADADRI: పసిడి వర్ణంలో వెలుగులీనుతూ కనువిందు చేసిన యాదాద్రి పుణ్యక్షేత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.