ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడం వల్ల.. యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం సందడి పెరిగింది. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి వచ్చి... నరసింహుడిని దర్శించుకుని తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.
ఇదీ చూడండి: నిజామాబాద్లో పోలింగ్ 8 గంటల నుంచి ప్రారంభం