యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా కొండచుట్టూ చేపడుతున్న వలయ రహదారి విస్తరణ పనులను అధికారులు వేగవంతం చేశారు. వైకుంఠ ద్వారానికి ఎదురుగా కూడలి రోడ్డు పనులు జరుగుతున్నాయి. మూడు వైపులా ఉన్న రహదారులను కలిపే పనులు పూర్తయ్యాయి. వలయ రహదారి పనులు దాదాపు 70శాతం పూర్తిగా వచ్చాయని... అధికారులు తెలిపారు.
కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నివాస గృహాల, దుకాణ సముదాయాలను, కూల్చివేతకు మార్కింగ్ పనులు చేపట్టిన ఆర్అండ్బీ అధికారులు.. విస్తరణలో తొలగించే 35 ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి 2,3 రోజుల్లో తొలగింపు పనులు చేపడతామని తెలుపుతున్నారు. నివాస గృహాల్లో దుకాణాల సముదాయులతో ఉన్న సామగ్రి... తదితర వాటిని ఖాళీ చేసి.. వేరే ప్రదేశానికి తరలిస్తున్నారు బాధితులు. విద్యుత్ అధికారులు కరెంట్ స్తంభాల తొలగింపు పనులు చేపట్టనున్నారు. మరోవైపు బాధితులు వారి ఇళ్ల తొలగింపు ప్రక్రియపై కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు