యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా... ప్రధానాలయం ఎదుట నిర్మిస్తున్న బ్రహ్మోత్సవ మండపం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మండపం ఇరువైపులా నిర్మించిన మెట్లకు కృష్ణ శిలతో రేలింగ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో పనులు పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.


రాయగిరి రైల్వేస్టేషన్ పేరు మార్పు..
యాదాద్రి సమీపంలోని రాయగిరి రైల్వే స్టేషన్ పేరు మారింది. దీన్ని యాదాద్రి స్టేషన్గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో రాయగిరి స్టేషన్ పేరును యాదాద్రిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైల్వే శాఖకు లేఖ రాయగా... దానిపై తాజాగా నిర్ణయం వెలువరించింది. సికింద్రాబాద్- ఖాజీపేట్ సెక్షన్లో రాయగిరి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి యాదాద్రి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


