Yadadri Patha Gutta Brahmotsavalu: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గత ఆరు రోజులుగా జరుగుతోన్న బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలకు అష్టోత్తర శతఘటాభిషేకంతో అర్చకులు పరిసమాప్తి పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉత్సవాలను ఘనంగా ముగించారు.
ఉత్సవాల ముగింపులో భాగంగా 108 కలశాలను వరుస క్రమంలో పేర్చారు. కలశాల్లోని పవిత్ర జలాలకు ప్రత్యేక పూజలు చేసి, అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆ జలాలతో స్వామి-అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేద పారాయణాలు, మేళ తాళాల మధ్య స్వామి-అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.
ఇదీ చూడండి: వైభవంగా యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. 15న రథోత్సవం