యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దర్శన సముదాయానికి సున్నాలు వేస్తున్నారు. వేసవిలో చల్లగా ఉండేలా ప్రత్యేక రంగులద్దుతున్నారు. ఈ భవనంలో భక్తుల కోసం ఏసీలు, పైకప్పు గోడ, ఫ్యాన్లు అమరుస్తున్నట్లు దేవస్థాన ఈఈ రామారావు తెలిపారు. ఇప్పటికే ఈ భవనంలో దర్శన వరుసలు పూర్తి కావొస్తున్నాయని చెప్పారు. ఫైర్ సేఫ్టీ, విద్యుత్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
శివాలయంలో భక్తుల కోసం స్టీల్‌తో తయారు చేసిన దర్శనం వరుసలు తెప్పించారు. వీటికి ప్రత్యేకంగా మార్కింగ్ వేశారు. శివాలయంలో దాదాపు అన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. నవగ్రహాలు, యాగశాల, మండపాల పైన గోపురాలు నిర్మిస్తున్నారు. కల్యాణ మండపం, స్వాగత తోరణం, రథశాల పనులు, కృష్ణ శిలతో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. శివాలయంతో పాటు సాలహారాలు, రాజగోపురాలు, ఆలయ ముఖమండపం, ఉప ఆలయాలకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు.
- ఇదీ చదవండి : ఎండా కాలం.. మండే వాహనం.. బీ అలర్ట్!