రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి క్షేత్రాభివృద్ధిలోని మిగిలిన పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసేందుకు యాడా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే కాకుండా శాస్త్రబద్ధంగా ఉండేందుకు సవరణలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆలయ మాడ వీధుల్లో నిర్మించిన ప్రహారీ గోడ తొలగింపు, కనుమ దారి విస్తరణ చేపట్టారు.
కొండ కింద వలయ దారి నిర్మాణానికై యంత్రాంగం అప్రమత్తమైంది. కనుమ దారి నుంచి పాదాల వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. స్వామి వారి జయంతి వేడుకలను పునర్నిర్మితమైన ప్రధాన ఆలయంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అంగరంగ వైభవంగా కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు