యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు రాత్రి స్వామివారు హంసవాహనం సేవపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు.
హంసరూపంలో ఉన్న స్వామి వారి విశిష్టతను అర్చకులు వివరించారు. ఈ సేవలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం