ETV Bharat / state

వైభవంగా యాదాద్రీశుడి కల్యాణం.. నేడు రథోత్సవం

author img

By

Published : Mar 5, 2020, 7:41 AM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వైభవం... అంబరాన్నింటింది. రంగు రంగుల పుష్పాలు, విద్యుత్తు దీపకాంతుల వెలుగులు, వేద పండితుల మంత్రోచ్చారణలతో.. యాదర్షి క్షేత్రం పులకించిపోయింది. లక్ష్మీ సమేత స్వామి వార్ల వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నేడు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు.

వైభవంగా యాదాద్రీశుడి కల్యాణం.. నేడు రథోత్సవం
వైభవంగా యాదాద్రీశుడి కల్యాణం.. నేడు రథోత్సవం

మంగళ వాయిద్యాలు.. మేళతాలాలు.. మిరుమిట్లు గొలిపే బాణసంచా.. వేద పండితుల నారసింహ జపం నడుమ యాదాద్రి స్వామి వారి కల్యాణ వేడుక వైభవంగా సాగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం బాలాలయంలో ఆస్థాన పరంగా కల్యాణం, రాత్రికి కొండ కింద తీర్థజనుల మధ్య నిర్వహించిన తిరుకల్యాణం వేడుకలు.. భక్తజనరంజకంగా సాగాయి. కొండపైన జరిగిన కల్యాణానికి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు ఉదయం యాదగిరీశుడు... హనుమంత వాహనంపై శ్రీరామావతారంలో ఊరేగారు.

రాత్రి తొమ్మిది గంటలకు కొండ కింద.. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా తిరు కల్యాణ ఉత్సవం ప్రారంభమైంది. అశేష సంఖ్యలో భక్తులు వేడుకను తిలకించేందుకు వీలుగా.. జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో పెళ్లి మండపం ఏర్పాటు చేశారు. బాలాలయంలో పరిమిత సంఖ్యలో మాత్రమే దేవదేవుని వివాహాన్ని తిలకించగా.. తిరుకల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వస్తివాచనం, అగ్ని పూజతో ప్రారంభమైన కల్యాణ క్రతువు.. మాంగళ్య ధారణ అనంతరం పూర్తయింది.

ఆలయ పునర్నిర్మాణాల దృష్ట్యా.. బాలాలయంలో వరుసగా నాలుగో ఏడాది కల్యాణ ఘట్టం నిర్వహించారు. గజవాహనంపై స్వామి వారు.. ముత్యాల పల్లకిలో అమ్మవారు కొలువుదీరిన వైనం.. కన్నులపండువగా సాగింది. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి రథోత్సవాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి: రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.