తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిరాడంబరంగా జరిగాయి. స్తానిక పురపాలక కార్యాలయం ఎదుట ఛైర్ పర్సన్ వేం రెడ్డి రాజు జాతీయ పతాకం ఆవిష్కరించారు. అమర వీరులకు నివాళి అర్పించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
త్యాగాలను స్మరిస్తూ..
మిషన్ భగీరథ పైలాన్ పార్క్ వద్దనున్న తెరాస కార్యాలయం ఎదుట.. మునుగోడు నియోజక వర్గ ఇంఛార్జీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో అలుపెరగకుండా ఉద్యమం చేసిన వారి త్యాగాలను స్మరించుకున్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో రాష్ట్రం నిలిచిందని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం